స్త్రీ, పురుషుడు కలిస్తే వివాహం జరిగినట్లే

స్త్రీ, పురుషుడు కలిస్తే వివాహం జరిగినట్లే
x
Highlights

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలో నూతన సవరణల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం...

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలో నూతన సవరణల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం శారీరకంగా కలిస్తే.. అధికారికంగా పెళ్లి జరిగినట్లే అని ఆ దేశ రాజ్యాంగం నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యాంగంలో కొత్త స‌వ‌ర‌ణ తీసుకురానున్నట్టు అధ్యక్షుడు ప్రకటించారు. అలాగే ఈ తరహా వివాహా ప్రక్రియను హెటిరోసెక్సువ‌ల్ యూనియ‌న్‌గా గుర్తించిన‌ట్లు రష్యా వెల్లడించింది. ఇదికాకుండా మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు పుతిన్.. దేవుడు అనే ప‌దాన్ని కూడా కొత్త స‌వ‌ర‌ణ‌ల‌తో రాజ్యాంగంలో చేర్చనున్నారు.

రాజ్యాంగ సవరణల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ 24 పేజీల స‌వ‌ర‌ణ‌ల‌ను రెండు రోజుల కిందట పార్లమెంట్‌కు స‌మ‌ర్పించారు. దీనిపై ఓటింగ్ జరగనుంది. ఈ రెండు సవరణలు ఆమోదం పొందితే ప్రపంచంలోనే సంచలనం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇటువంటి సాహసం ఏ దేశం చెయ్యలేదు. సాధారణంగా వ్యక్తి ఇష్టప్రకారం వివాహం అనేది ఉంటూ వస్తోంది.. కానీ రష్యా మాత్రం అందుకు బిన్నంగా నిర్ణయం తీసుకుంటోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే స్వలింగ సంప‌ర్కుల వివాహాల‌ను చ‌ట్టబ‌ద్దం చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ఇటీవ‌ల పుతిన్ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే.

కాగా సెక్యూలర్‌ దేశమైన రష్యాలో అధికశాతం సాంప్రదాయ క్రిస్టియన్లు ఉన్నారు. అయితే స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌తో చర్చించాకే ఈ రాజ్యాంగ సవరణలకు శ్రీకారం చుట్టిన‌ట్లు ఆ దేశ పార్లమెంట్‌ స్పీక‌ర్ వ‌చ‌స్లేవ్ వోలోడిన్ తెలిపారు. వచ్చే వారం జరగబోయే సెషన్స్ లో వీటిపై చర్చ ఉంటుందని.. ఏప్రిల్ 22 న బహిరంగ ఓటు ఉంటుందని వోలోడిన్ స్పష్టం చేశారు. 20 ఏళ్లుగా రష్యాపై ఆధిపత్యం ప్రదర్శించిన 67 ఏళ్ల పుతిన్, పాశ్చాత్య వ్యతిరేక మరియు సాంప్రదాయిక ఆలోచనలను ప్రోత్సహించి.. సరైన విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తే.. సెంట్రల్ మాస్కోలో 22,000 మందికి పైగా ప్రజలు ర్యాలీ చేసి పుతిన్ ఎప్పటికి అధికారంలో ఉండకూడదని పిలుపునివ్వడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories