Iran-Israel War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగియొచ్చు.. ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు

Iran-Israel War
x

Iran-Israel War: త్వరలో ఇరాన్‌తో యుద్ధం ముగియొచ్చు.. ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు

Highlights

Iran-Israel War: ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగియవచ్చని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇప్పటివరకు తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరుకున్నట్లు ఆయన చెప్పారు.

Iran-Israel War: ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగియవచ్చని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇప్పటివరకు తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరుకున్నట్లు ఆయన చెప్పారు.

గతకొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతోన్న యుద్ధం ఏకంగా పశ్చిమాసియాను కుదిపేస్తుంది. ఇప్పటివరకు పరోక్షంగా ఇజ్రాయిల్‌కు సహకరించిన అమెరికా ఇప్పుడు ప్రత్యేకంగా దిగి ఇరాన్‌పైన దాడుల చేసింది. ఈ దాడుల్లో అణు స్థావరాలు నేటమట్టమయ్యాయిని ఇజ్రాయిల్ తెలిపింది. ముఖ్యంగా టెహ్రాన్‌లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా సేనలు తీవ్రంగా ధ్వంసం చేశాయి. ఇరాన్ నుంచి వచ్చే అణు ముప్పును తొలగించుకున్నాం. ఇక టెహ్రాన్‌ను టార్గెట్ చేసుకుని జరపాల్సిన ఆపరేషన్లు ముగిసినట్లే. ఇదే కొనసాగితే త్వరలోనే ఇరాన్‌పై యుద్ధం ముగియవచ్చని నెతన్యాహు అన్నారు.

అంతేకాదు, అణుబాంబులను చూపించి, ఇజ్రాయిల్‌ను తుడిచిపెట్టాలని ఇరాన్ పాలకులు చూశారు. అందుకే ఇరాన్‌పై తాము దాడుల చేయాల్సి వచ్చిందని, ముఖ్యంగా మా దేశానికి ముప్పుగా ఉండే రెండు లక్ష్యాలను తాము పూర్తిగా తొలగించామని, ఇక టెహ్రాన్‌తో యుద్ధ కొనసాగించబోం..అని అన్నారు. అయితే తాము అనుకున్న ఫలితం రాకపోయినా, ఇరాన్ మరే ఇతర ప్లాన్లు వేసినా మళ్లీ తాము దాడులు కొనసాగించాల్సి వస్తాదని కూడా నెతన్యాహు ఇరాన్‌ పాలకులను హెచ్చరించారు.

ఇదిలాఉంటే ఇరాన్‌పై అమెరికా దాడుల చేయడంపై ఆమెరికా తీవ్రవిమర్శలను ఎదుర్కొంటుంది. అమెరికాతో కలిసి దాడులు చేయించి ఇజ్రాయిల్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, క్షిపణులు, బాంబర్లతో అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడిందని, దీనివల్ల తమ దేశానికి ఎంతో నష్టం జరిగిందని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. మరోపక్క ఫ్రాన్స్ కూడా ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులను తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా అమెరికా ఈ దాడులు జరిపి తప్పు చేసింది, ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ అన్నారు.

మరోపక్క ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపిన తర్వాత అత్యవసర సమాశేసమైంది. అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి, నెతన్యాహు అమెరికాను ఈ యుధ్ధంలోకి లాగారంటూ, అమెరికా చరిత్రలో ఒదొక తీరని మచ్చని ఈ సమావేశంలో ఇరాన్ రాయబారి అమీర్ సహీద్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై అనవసరంగా దాడులు చేస్తున్నాయని, దీనికి సరైన సమాధానం చెప్పాలని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories