Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు

Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
Nepal: *రాళ్లదాడికి దిగిన ఆందోళనకారులు *టియర్ గ్యాస్‌ను ప్రయోగించిన పోలీసులు
Nepal: నేపాల్‌లో చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇంధన ధరల పెంపునకు నిరసనగా కర్రలకు నిప్పంటించుకుని విపక్షానికి చెందిన విద్యార్థి విభాగం ర్యాలీలను చేట్టింది. అయితే పోలీసులకు ఆందోలనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లను రువ్వారు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. తాజా దీంతో దేశ రాజధాని ఖాట్మాండులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని నేపాల్ పోలీసులు తెలిపారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో నేపాల్‌కు చమురు ఉత్పత్తులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయమైన నేపాల్‌లో కోవిడ్ కారణంగా పరిస్థితి పర్యాటకులు భారీగా తగ్గిపోయారు. ఫలితంగా ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. విదేశీ మారక నిధులు కొరత ఏర్పడింది. ఇప్పటికే విలువైన బంగారం, కార్ల దిగుమతిని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. గత్యంతరంలేక తాజాగా పెట్రోలు ధరలను పెంచింది. లీటరు పెట్రోలుపై తాజాగా 21 నేపాలీ రూపాయలు, డీజిల్, కిరోసిన్‌పై 27 రూపాయలను పెంచింది. దీంతో లీటరు పెట్రోలు ధర 199 రూపాయలకు చేరుకోగా డీజిల్, కిరోసిన్ ధర 192 రూపాయలయ్యింది.
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే అమలు చేసింది. పెట్రోలు ధరలను పెంచడంపై ప్రతిపక్ష పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ-యూఎంఎల్ అనుబంధ విద్యార్థి సంఘం ఆల్ నేపాల్ ఫ్రీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రాజధానిలో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే నేపాల్‌లో ఇటీవల ఆహార, చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం 7.87 శాతానికి పెరిగింది. దీంతో 2 కోట్ల 90 మంది ప్రజలపై దీని ప్రభావం పడుతోంది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణాసిలోని శ్రీలంక, పాకిస్థాన్ తరువాత నేపాల్ ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఆ దేశంలో పరిస్థితులు ఇప్పటికే ఆందోళనకరంగా మారింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT