Nepal Bus Accident: నేపాల్ బస్సు ప్రమాదం .. లోయలో పడి 13 మంది మృతి

Nepal Bus Accident: నేపాల్ బైతాడి జిల్లాలో బస్సు 200 మీటర్ల లోయలో పడిన ప్రమాదంలో 13 మంది మృతి, 34 మంది గాయాలు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, కారణాలపై దర్యాప్తు.

Nepal Bus Accident: నేపాల్ బస్సు ప్రమాదం .. లోయలో పడిపడి 13 మంది మృతి
X

Nepal Bus Accident: నేపాల్ బస్సు ప్రమాదం .. లోయలో పడిపడి 13 మంది మృతి

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిథోరాగఢ్‌కు ఆనుకుని ఉన్న బైతాడి జిల్లాలో వివాహ కార్యక్రమానికి వెళ్తున్న అతిథులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ పోలీసులు, స్థానిక అధికారులు మరియు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం బైతాడి, దాదేల్ధురా ప్రాంతాల ఆసుపత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రాథమిక వివరాల ప్రకారం బస్సులో ప్రయాణించిన వారంతా నేపాలీ పౌరులేనని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే పర్వత ప్రాంతాల్లో పదునైన మలుపులు, దెబ్బతిన్న రహదారి పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story