NASA: వ్యోమగాములకు స్వాగతం పలికిన నాసా..స్పేస్ ఎక్స్ ది అద్భుత పాత్ర: నాసా

NASA: వ్యోమగాములకు స్వాగతం పలికిన నాసా..స్పేస్ ఎక్స్ ది అద్భుత పాత్ర: నాసా
x
Highlights

NASA: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల తర్వాత ఈరోజు బుధవారం భూమికి తిరిగి వచ్చారు. అందరు వ్యోమగాములు...

NASA: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల తర్వాత ఈరోజు బుధవారం భూమికి తిరిగి వచ్చారు. అందరు వ్యోమగాములు భూమిపై విజయవంతంగా దిగారు. మొత్తం బృందం వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. నాసా ఒక పత్రికా సమావేశంలో మొత్తం మిషన్ విజయవంతమైందని ప్రకటించింది. అంతా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, వ్యోమగాములందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని నాసా తెలిపింది.

విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంతో స్పేస్ ఎక్స్ ది అద్భుత పాత్ర అని కొనియాడింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి సుమారు 17 గంటలపాటు పయనించి..బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు.

స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం శక్తిని చాటి చెప్పింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్ కు ఇబ్బంది కాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతాపరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి.

ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవసహిత అంతరిక్షయాత్రకు కొత్తబాట చూపాయి. ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మర వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేట్ భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభమని ఈ యాత్రలో సునీతా విలియమ్స్ రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని నాసా ఉన్నతాధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories