logo

ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే ఇలా గూగుల్ కు దొరికిపోవడం ఖాయం..

ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే ఇలా గూగుల్ కు దొరికిపోవడం ఖాయం..
Highlights

ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే ఇలా గూగుల్ కు దొరికిపోవడం ఖాయం..

చుట్టూ ఎవరూ లేరు కదా అని ఓ చిలిపి జంట రొమాన్స్ మొదలుపెట్టింది.. అయితే గూగుల్.. మాత్రం దాన్ని ప్రపంచానికి పంచేసింది. దీంతో ఆ జంట గూగుల్ లో ఫేమస్ అయిపోయింది. ఈ ఘటన తైవాన్ లో జరిగింది. తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట నిర్జన ప్రాంతంలోకి వెళ్లారు.. చుట్టూ చూశారు.. ఎవరూ లేరు కదా అని దుస్తులు విప్పేసి నగ్నంగా ఒకరినొకరు కౌగిలించుకొని లోకాన్ని మరిచిపోయారు. ఇంతలో గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో శాంటియన్ రోడ్‌ స్ట్రీట్ వ్యూ చూసేవాళ్లకు ఈ దృశ్యం స్పష్టంగా కనిపించింది.

దీంతో కొందరు ఆకతాయిలు దీన్ని ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతకంటే కూడా వాళ్ళ దురదృష్టం ఏంటంటే.. వారి ఏకాంత క్షణాలను గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమేరా క్లిక్ చేయడంతో గూగుల్ మ్యాప్‌లకు ఆటోమాటిక్ గా అప్‌లోడ్ అయింది. దాంతో ఆ జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా 360 డిగ్రీ టెక్నాలజీ కెమేరాలతో గూగుల్ స్ట్రీట్ వ్యూను చిత్రీకరణ చేస్తే ఆ కెమేరా చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను క్లిక్ చేసి శాటిలైట్ మ్యాప్‌లో అప్‌లోడ్ అవుతుంది. గూగుల్ లో ఉన్న ఈ టెక్నాలజీ పుణ్యమాని ప్రేమికులు ప్రపంచానికి దొరికిపోతారు.. జర జాగ్రత్త.


లైవ్ టీవి


Share it
Top