ముషారఫ్‌ను అసలు వదలకండి..మూడు రోజుల వేలాడతీయండి పాక్ కోర్టు

ముషారఫ్‌ను అసలు వదలకండి..మూడు రోజుల వేలాడతీయండి పాక్ కోర్టు
x
Musharraf File Photo
Highlights

దేశ ద్రోహం కేసు విచారణ కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి ధర్మాసనం ఏర్పాటు చేసింది. ముషారఫ్ కేసులో 167 పేజీల తీర్పును లిఖించారు.

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష విధిస్తూ పెషావర్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దేశ ద్రోహం కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ముషారఫ్‌కు ఉరి శిక్ష అమలు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని పాక్ సైన్యం కొట్టి పారేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముషారఫ్‌ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్ ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్ సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.

ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే రాజ్యాంగాన్నికి వ్యతిరేంగా 2007న నవంబర్‌ 3న దేశంలో ఎమర్జెనీ విధించినందుకు ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. దీనిపై ముషారఫ్‌ ఓ వీడియోలో స్పందించారు. ఉరి శిక్ష విధించడం తనపై వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యగా పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రకారమైతే చూస్తే ఈ కేసును కొట్టిపారేయాలి, కానీ, నాపై వ్యక్తిగత కక్ష్యలతో కొంత మంది ఈ కేసును మళ్లి విచారణకు తీసుకొచ్చారు. కేవలం నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ముషారఫ్ పేర్కొన్నారు.

దేశ ద్రోహం కేసు విచారణ కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి ధర్మాసనం ఏర్పాటు చేసింది. ముషారఫ్ కేసులో 167 పేజీల తీర్పును వెల్లడించారు. అందులో పలు ఆసక్తికర అంశాలు పేర్కొన్నారు. ఉరి శిక్ష విధించడానికి ముందే ఏదైనా కారణంతో ముషారఫ్ చనిపోతే ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్‌లోని డి-చౌక్‌ జంక్షన్‎ వద్దకు ఈడ్చుకెళ్లి మూడు రోజులు వేలాడతీయాలని తీర్పులో కాపీల్లో రాసినట్లు వార్తలు వస్తున్నాయి.ముషారఫ్ కు ఉరి శిక్ష విధించడాన్ని పాక్ లో కొందరూ తప్పు పడుతున్నారు. అయితే ముషారఫ్ తనకు మద్దతు తెలిపిన వారికి వీడియో ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories