Mummified Monk Inside Ancient Buddha Statue: పురాతన విగ్రహాన్ని స్కాన్ చేస్తూ ఖంగుతిన్న అధికారులు.. లోపల అస్థిపంజరం.?

Mummified Monk Inside Ancient Buddha Statue:  పురాతన విగ్రహాన్ని స్కాన్ చేస్తూ ఖంగుతిన్న అధికారులు.. లోపల అస్థిపంజరం.?
x
scan revealed mummified monk inside ancient buddha statue
Highlights

Mummified Monk Inside Ancient Buddha Statue: ఇటీవల పురాతన బుద్ధుడి విగ్రహం ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ విగ్రహం ఇటీవల పురావస్తు శాఖ అధికారుల జరిపిన తవ్వకాల్లో బయటపడింది

Mummified Monk Inside Ancient Buddha Statue: ఇటీవల పురాతన బుద్ధుడి విగ్రహం ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఈ విగ్రహం ఇటీవల పురావస్తు శాఖ అధికారుల జరిపిన తవ్వకాల్లో బయటపడింది. అయితే అది ఏ కాలం నాటిది, దాని మూలాలు ఏంటన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్‌ మ్యూజియంలో ఉన్న విగ్రహం పుట్టుపూర్వార్థరాల గురించి తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని అధునాతన యంత్రాలను వినియోగించి స్కాన్ చేశారు.. దాంతో వారికి అందులో కనిపించిన వస్తువును చూసి ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయినా అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అని అనుకుంటున్నారా? అందులో ఒక మనిషి అస్థిపంజరం ఉంది.

దాంతో ఆ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసిన అధికారులు షాక్ కు గురయ్యారు. మనిషి అస్థిపంజరం అందులోకి రావడం ఏంటని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. అయితే ఫైనల్ గా తేల్చినది ఏమిటంటే ఆ విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల నాటిదని 11వ శతాబ్దం లేదా 12 శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విగ్రహం మమ్మీ మాదిరిగా దాని చుట్టూ వస్త్రం కప్పి ఉండటమే కాకుండా చైనా భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. అది చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ద సన్యాసిదని గుర్తించారట.. ప్రస్తుతం ఆ విగ్రహంపై పలు రకాలుగా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories