logo

డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట

డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట లభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా కుట్ర పన్నిందంటూ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఊరట లభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా కుట్ర పన్నిందంటూ వచ్చిన ఆరోపణపై ఎలాంటి ఆధారాలు లేవని ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ ముల్లర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాబర్ట్ ముల్లర్ తన నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ట్రంప్ చట్టాన్ని అతిక్రమించలేదని అందులో స్పష్టం చేశారు. కాగా దీనిపై దాదాపు 22 నెలలపాటు దర్యాప్తు సాగింది. అయితే ఇన్ని రోజుల్లో ఏ ఒక్క ఆధారం కూడా సంపాదించలేదు.

దీంతో ఎన్నికల్లో ట్రంప్ కు అనుకూలంగా రష్యా ప్రమేయం లేదని తేలింది. కొంతకాలంగా దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఈ నివేదికతో ఊరట లభించినట్లయింది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా సాగిన ఈ దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించలేదని అటార్నీ జనరల్ విలియమ్ తెలిపారు. కాగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ రష్యాప్రభుత్వంతో కలిసి కుట్రపన్నారని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీక్లింటన్ తోపాటుగా పలువురు ఆరోపించారు.

లైవ్ టీవి

Share it
Top