బాలుడి పక్కనో వింత ఆకారం ఆత్మేనా... తెలిస్తే పగలపడి నవ్వుతారు!

బాలుడి పక్కనో వింత ఆకారం ఆత్మేనా... తెలిస్తే పగలపడి నవ్వుతారు!
x
Highlights

హాలీవుడ్ సినిమాల్లో దైయ్యాలు, ఆత్మలు చూస్తుంటాము. అవి రాత్రులు చేసే అరుపులు, కేకలు ఏడుపులు వింటే భయంతో వణిపోతాం. కానీ చాలా చిత్రాల్లో ఆత్మలుగా మహిళలు, పురుషులును చూస్తుంటాం

ఆంగ్ల చిత్రాల్లో దైయ్యాలు, ఆత్మలు చూస్తుంటాము. అవి రాత్రులు చేసే వింత వింత శబ్ధాలు, అరుపులు, కేకలు, ఏడుపులు వింటే భయంతో వణిపోతాం. కానీ చాలా చిత్రాల్లో ఆత్మలుగా మహిళలు, పురుషులను చూస్తుంటాం. కానీ చిన్నపిల్లలు ఆత్మలుగా వచ్చిన చిత్రాలు పెట్ సెమెన్ట్ర్రీ, అనబెల్, వంటి రెండు మూడు చిత్రాలు మాత్రవే ఉంటాయి. తెలుగులోనూ రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రాలు వచ్చాయి.

అయితే అమెరికాలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందరిని భయానికి గురిచేసింది. ముఖ్యంగా ఇంట్లో నివాసం ఉండే పిల్లాడి తల్లికీ భయంతతో వణికిపోయింది. కానీ ఆమె అసలు నిజం తెలుసుకున్నాక మాత్రం నవ్వు ఆపులోకపోయింది. ఇంతకీ ఎంటా సంఘటన అంటారా?

మారిటజా ఎలిజబెత్ భర్త,కుమారుడుతో అమెరికాలోని నపెర్‌విల్లేలో ఉంటుంది. ఎప్పటిలాగే ఆరోజు కూడా తన పిల్లడిని బెడ్ మీద పడుకోబెట్టింది. పిల్లాడు నిద్రపోయాడు ఆమె కూడా కాస్త కునుకు తీసింది.అదే రోజు రాత్రి తనకు కొడుకు నిద్రలో కదిలినట్లుగా ఎందుకో చిన్న అలికిడి వినిపించింది. దీంతో కళ్లు తెరిచి కొడుకు నిద్రపోతున్న బెడ్ వైపు చూసింది. చిన్నారి పక్కనే ఓ ఆత్మ ఆకారం ఆమెకు కనిపించింది. అంతే ఒక్కసారి ఆమెకు గుండె ఆగినంత పనైంది.

తన చేతిలోని మొబైల్ తీసుకుని దానిలోని ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. ఆ ఆత్మను ఫోటో కూడా తీసింది. దానిని భాగా పరీశీలించింది. దీంతో ఏం చేయాలో తెలియలేదు. ఆమె కాళ్లు చేతులు వణికిపోయాయి. ఆ ఆత్మ పిల్లాడిని ఏమైనా చేస్తుందేమో అనే భయంతోనే రాత్రంతా పిల్లడిని చూస్తూ నిద్రలేకుండా గడిపింది.

కాగా.. కాస్త నిద్రలోకి జారుకున్న ఆమె ఒక్క సారిగా పిల్లాడి ఏడుపుతో ఉలిక్కిపడి లేచింది కొడుకు బెడ్ వైపు చూసి నవ్వు ఆపుకోలేక పోయింది. తన భర్త చేసిన ఓ పొరపాటు వల్ల ఆమె రాత్రంతా భయంతో వణిపోవాల్సివచ్చిందని గ్రహించింది. ఇంతకి ఆమె భర్త చేసిన పొరపాటు ఏంటంటే.. కొడుకు నిద్రకు ఉపక్రమించే ఆ బెడ్ పై ఓ స్టిక్కర్ ఉంది. చిన్నారి బొమ్మ ఉన్న అంటించిన స్టిక్కర్ ఉంది. బెడ్‌ను భర్త కొనుగోలు చేసిన వెంటనే స్టిక్కర్ తీయలేదు. దీంతో ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలోని అందరితో పంచుకుంది. ఈ విషయం ముందే చెప్పనందుకు తన భర్తపై కోపపడ్డానిని తెలిపింది. రాత్రి బెడ్‌లైట్ వెలుగులో కలిసిపోవడం వల్ల అది శిశువు ఆత్మలా కనిపించిందని వివరించింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories