ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్.. ఇప్పటికే 12 దేశాలకు విస్తరణ

Monkeypox Virus Cases in World | Telugu News
x

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ ఫాక్స్.. ఇప్పటికే 12 దేశాలకు విస్తరణ

Highlights

*బ్రిటన్ లో కోతి నుండి మనిషికి సోకిన మంకీ ఫాక్స్

Monkeypox: ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ మంకీ ఫాక్స్ వణికిస్తోంది. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ కు మరో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ కొత్తవైరస్ 12 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. సుమారు 80 కేసులు నమోదయ్యాయని, వైరస్ వ్యాప్తిపై విసృతంగా స్టడీ చేయనున్నట్లు W. H. O తెలిపింది.

మంకీ ఫాక్స్ కేసులు మరిన్ని పెరగే అవకాశం ఉందని.. ఈ వ్యాధి జంతువుల నుండి మనుషులకు సోకుతుందని తెలిపింది డబ్ల్యూహెచ్ వో.. అయితే మంకీ ఫాక్స్ ప్రమాదకరమైనా... ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మంకీ ఫాక్స్ విపత్తుగా మారే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాలన్నారు.

ఇప్పటికే భారత్ లో కరోనా కేసులు తగ్గిపోయాయని రిలాక్స్ అవుతున్న టైమ్ లో కొత్త వైరస్ కలవరపెడుతోందంటున్నారు వైద్యులు. మంకీ ఫాక్స్ కేసులు ఇతర దేశాల్లో పెరుగుతున్నాయని, మన దేశంలో ఇంకా నమోదు కాలేదని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి ఉంటే.. ఇంకొకరికి తప్పకుండా సోకుతుందని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బ్రిటన్ లో మొదట కోతికి సోకిన ఈ వ్యాధి ఇప్పుడు మనుషులకు సోకుతుందని.. యువకులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్.


Show Full Article
Print Article
Next Story
More Stories