ఆ మార్కెట్లో డబ్బులను తూకమేసి అమ్ముతారు

ఆ మార్కెట్లో డబ్బులను తూకమేసి అమ్ముతారు
x
Highlights

మన దేశంలో కూరగాయలు, పండ్లు అమ్మినట్టుగా ఆ దేశంలో డబ్బులను తూకం వేసి మరీ అమ్ముతారు.

మన దేశంలో కూరగాయలు, పండ్లు అమ్మినట్టుగా ఆ దేశంలో డబ్బులను తూకం వేసి మరీ అమ్ముతారు. మన కరెన్సీలో వాళ్లకి రూ.650 ఇస్తే చాలు వాళ్ళు మనకి 50 కిలోల కరెన్సీని ఇస్తారు.ఆ దేశంలో వీధిగుండా వెళ్తుంటే ఎక్కడ చూసినా డబ్బు కుప్పలే కనిపిస్తాయి. ఇంత డబ్బు వుండి కుడా ఆ దేశం ఇంకా పేదరికంలోనే వుంది. ఒకప్పటి కాలంలో మన దేశంలో ఉపయోగించిన వస్తుమార్పిడి పద్ధతిని ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని సోమాలియాల్యాండ్ లో కొనసాగుతుంది. ఇంత డబ్బు వుండి కూడా ఈ దేశంలో వస్తుమార్పిడి పద్ధతి ఎందుకొచ్చింది. అసలు దీని వెనకగల కారణం ఏంటి తెలుసుకుందాం..

ఈ దేశం ఇలా కావడానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. 1991లో యుద్ధం తర్వాత సోమాలియా ల్యాండ్, సోమాలియా దేశం నుంచి విడిపోయింది. అప్పటికే ఆదేశంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ దేశాన్ని డబ్బున్న దేశంగా మార్చడానికి అక్కడున్న నాయకులు విచ్చలవిడిగా కరెన్సీని ముద్రించి ఇంటింటికీ పంచారు. డబ్బు ఎక్కువగా కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఏ పని చేయకుండా బద్దకస్తులుగా తయారయ్యారు. పన్నులు కట్టే అవసరంకుడా ఆ ప్రాంత ప్రజలకు లేకుండా పోయింది. దీంతో విలువ తగ్గిన ఈ కరెన్సీ విదేశీ అప్పులు తీర్చడానికి కూడా పనిచేయకుండా మిగిలిపోయింది. మరికొన్ని దేశాలైతే ఈ కరెన్సీని మోత్తానికే వాడుకలో లేకుండా చేశాయి. నగదును వాడుకలో లేకుండా చేయడంతో ఆ ప్రజలు పురాతనంలో వాడుకలో వున్న వస్తుమార్పిడి పద్ధతిని ఎంచుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories