జమైకా సుందరికి మిస్ వరల్డ్ కిరీటం

జమైకా సుందరికి మిస్ వరల్డ్ కిరీటం
x
మిస్ వరల్డ్ కిరీటాన్నిఅలంకరిస్తున్న 2018 మిస్ వరల్డ్ వనెస్సా పోన్సె
Highlights

ఈ ఏడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని జమైకా సుందరి దక్కించుకున్నారు. ఆమెకు గట్టి పోటీ ఇచ్చిన ఇండియా, ఫ్రాన్స్ భామలు చివరి మెట్టుమీద వెనుకపడ్డారు.

అందం అమ్మాయంటే అంటూ ఓ రచయిత పాటను రాసాడు. నిజమే అందం అంటే అమ్మాయి, అమ్మాయి అంటేనే అందం. ఎక్కువగా కవులు సున్నిత మైన మనస్సు కలిగిన అందాభామలను పువ్వులతో, ప్రకృతితో పోలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన భామల కోసం అందాల పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను కాలనీ నుంచి ప్రపంచ స్థాయి వరకు నిర్వహిస్తుంటారు. మిస్ విలేజ్, మిస్ కాళేజ్, మిస్ స్టేట్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, చివరికి మిస్ యూనివర్స్ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు.

ఈ పోటీలో అందంగా ఉన్న ప్రతి అమ్మాయి ముందంజలో ఉండాలనే చూస్తారు. తానే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ గా నిలవాలనుకుంటారు. ఈ అందాల పోటీల్లో బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, తెలివి తేటలు, సమయస్పూర్తి, అంతహ‌:సౌందర్యం అన్నీ కలగలిపి ఉండాలి. పోటీల్లో ఎంత మంది పాల్గొన్నా, ఎంత మంది ఫినాలెకి చేరుకున్నా, చివరికి గెలిచేది ఒకరే. అందంతో పాటు, తమ తెలివితేటలతో న్యాయనిర్ణేతలు ఎవరు మెప్పిస్తారో వారికే అందాల పోటీల్లో కిరీటం పెడతారు.

ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయి అందాల పోటీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం దీనికి వేదిక అవుతుంది. ఈ ఏడాది కూడా ప్రపంచ అందాల పోటీలను లండన్ లో నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపుగా 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. నవంబరు 20న మొదలైన ఈ పోటీల్లో అన్ని దశలు ముగిసిన తరువాత కేవలం 10 మంది మాత్రమే ఫైనల్స్‌ కు వెళ్లడానికి అర్హత సాధించారు. ఇందులో విశేషం ఏమంటే ఈ ఏడాది పాల్గోన్న యువతుల్లో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ టైటిల్స్‌ నల్లజాతి యువతులే దక్కించుకున్నారు.

ఈ పోటీల్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని జమైకా భామ టోనీ-యాన్‌ సింగ్‌ గెలుచుకుంది. ఇక రెండో రన్నరప్ గా భారత్ కు చెందిన సుమన్‌రావు (20) (రాజస్థాన్‌) నిలిచారు. ఇదిలా ఉంటే మొదటి స్ధానంలో గెలిచిన యాన్ సింగ్ కు 2018 మిస్ వరల్డ్ వనెస్సా పోన్సె కిరీటం అలంకరించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొదటి రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫెలే మెజినో ఛాన్స్ కొట్టేశారు. అయితే, ఈ పోటీల్లో విజేతగా నిలిచిన టోని యాన్ సింగ్ కు ఒఫెలే, సుమన్ రావు గట్టిపోటీని అందించారు. ప్రతి రౌండ్ లోనూ ముగ్గురు తగ్గ పోరుగా గా పోటీపడ్డారు. కానీ, చివరి రౌండ్ లో న్యాయనిర్ణేతలు అడిగిన చివరి ప్రశ్నకు యాన్ సింగ్ తన తెలివితో చక్కటి సమాధానం అందించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.

ఇప్పటి వరకూ ప్రపంచ సుందరి కిరీటాన్ని జమైకా దేశం నాలుగో సారి దక్కించుకుని రికార్డులకు ఎక్కింది. 1963లో మొదటి సారి జమైకాకు చెందిన భామ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుపొందగా, ఆ తర్వాత 1976, 1993లో ఈ టైటిల్ ను కరేబియన్ యువతులు గెలుచుకున్నారు. చాలా సంవత్సరాల తరువాత అంటే దాదాపుగా 26 ఏళ్లు గడిచిన తరువాత జమైకా నుంచి మరో మహిళ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచింది.

విజేతగా నిలిచిన యాన్ సింగ్ కు పాటలు పాడటం, వంట చేయడం హాబీ. తాను వైద్య విద్య పూర్తిచేసి అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్, సైకాలజీలో పీజీ చేశారు. అంతే కాదు తన చదువులు పూర్తి చేసుకున్నాక ఫ్లోరిడా యూనివర్సిటీలో కరేబియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా తన విధులను నిర్వర్తించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories