Minister KTR: భారత్‌కు తెలంగాణ మోడల్ కావాలి.. మంత్రి కేటీఆర్ పిలుపు

Minister KTR Says India Needs Telangana Model
x

Minister KTR: భారత్‌కు తెలంగాణ మోడల్ కావాలి.. మంత్రి కేటీఆర్ పిలుపు

Highlights

Minister KTR: బ్రిడ్జ్ ఇండియాతో కలిసి EPG నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్

Minister KTR: ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చేకునేలా యువతను తయారుచేసినప్పుడే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ఐటి, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తంచేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, లండన్‌లో జరిగిన 'ఐడియాస్‌ ఫర్‌ ఇండియా' సదస్సులో పాల్గొని తొమ్మిదేండ్ల తెలంగాణ విజయగాథను వివరించే ప్రయత్నం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలను సాధించడంతోనే అనతికాలంలో తెలంగాణ ప్రగతి సాధ్యమైందన్నారు. తెలంగాణ మోడల్ ను అనుసరిస్తే ఇండియాకు తిరుగు ఉండదన్నారు. భారతదేశ విజయవంత స్టార్టప్ రాష్ట్రం-తెలంగాణ విజయగాథను వివరించిన మంత్రి కేటీఆర్, కేవలం తొమ్మిదేళ్లలోనే విప్లవాత్మక ప్రగతితో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడంతోనే ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పును సాధించామన్నారు.

అంత్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీలకు హైదరాబాద్ నిలయమన్న కేటీఆర్, వినూత్న ఆవిష్కరణలకు కేంద్రమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ T-హబ్‌తో పాటు భారతదేశపు అతిపెద్ద నమూనా కేంద్రం T-వర్క్స్, భారతదేశపు మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్త ఇంక్యుబేటర్ We-Hub, గ్రామీణ ఆవిష్కర్తలకు సహాయం చేయడానికి TSIC, యువతకు దిశానిర్దేశం చేసే అతిపెద్ద శిక్షణా కేంద్రం TASK ను ఏర్పాటుచేశామని వివరించారు.

భారతదేశానికి అనేక సహజ అనుకూలతలు ఉన్నాయి. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు, ఖనిజాలతో పాటు తగినంత కరెంటును ఉత్పత్తి చేయడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. దేశంలో ఉన్న నదులు, సరస్సులు, నీటి వనరులతో వ్యవసాయ భూములకు కావాల్సినంత సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలందరికి తాగునీరు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నీళ్లు సరఫరా చేయవచ్చు. వీటన్నింటికన్న ముఖ్యంగా సాటిలేని మానవ వనరులు మనదేశంలో పుష్కళంగా ఉన్నాయన్నారు మంత్రి కెటి రామారావు .

విద్యుత్, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక రంగాలలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్న విధానాలు, ప్రత్యేక పథకాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఆయా రంగాల్లో సాధించిన విజయాలను ఎత్తిచూపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ ఉందన్న కేటీఆర్, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినంక మన తలసరి ఆదాయం 2.5 రెట్లు పెరిగిందన్నారు. 2.5% జనాభా ఉన్న రాష్ట్రం భారతదేశ జిడిపిలో 5%కి దోహదం చేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories