ట్విట్టర్‌పై మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు

ట్విట్టర్‌పై మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు
*ట్విట్టర్‌లో తప్పుడు సమాచారాన్ని నాశనం చేస్తారన్న గేట్స్
Bill Gates: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ చేతిలో ట్విట్టర్ అధ్వానంగా మారుతుందన్నారు. అయితే ట్విట్టర్‌లో ఫేక్ సమాచారాన్ని పూర్తిగా తొలగిస్తారనే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌కు మంచి బిజినెస్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉందని ట్విట్టర్‌ను మరింతగా తీర్చి దిద్దుతారని కితాబిచ్చారు. టెస్లాను, స్పేస్ ఎక్స్ సంస్థలను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయా కంపెనీల్లో మస్క్ నిపుణులైన ఇంజనీర్లను నియమించుకున్నారని ట్విట్టర్‌లో కూడా కొత్త మార్పులు తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ట్విట్టర్‌లో ఏం జరుగుతుందో తెలియదన్న గేట్స్ ఎలాన్ ఆలోచనలను తక్కువ అంచనా వేయలేమన్నారు.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేసిన మస్క్ ఆ తరువాత ట్విట్టర్‌ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేశారు. అయితే ట్విట్టర్ బోర్డు మస్క్‌ను అడ్డుకునేందుకు పాయిజన్ పిల్‌ను వేసింది. అయితే మస్క్ పట్టువదలకుండా ప్రయత్నించి చివరికి సొంతం ఆ సంస్థను సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్‌లో వాక్ స్వాతంత్రం లేదని దాని కోసమే సంస్థను ప్రవేటు సంస్థగా మార్చాలని గతంలో మస్క్ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ తన చేతికి వచ్చిన తరువాత మరిన్ని అందుకు ప్రాధాన్యం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలో ట్విట్టర్‌కూ పే యాప్‌గా మారనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఈ పేమెంట్ పద్ధతిని తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్య యూజర్లకు మాత్రం ఉచితంగా ఉండననున్నట్టు సమాచారం.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
కాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMT