మేడే నేడే : శ్రమ దోపిడీపై పెను గర్జన.. ఉద్యమ చరిత్ర

మేడే నేడే : శ్రమ దోపిడీపై పెను గర్జన.. ఉద్యమ చరిత్ర
x
Highlights

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఏన్నో ఏళ్లుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా..జీవనాన్ని ఆకాంక్షిస్తూ మేడేను జరుపుకుంటున్నాం.

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఏన్నో ఏళ్లుగా శ్రామికజన సంఘీభావ చిహ్నాంగా..జీవనాన్ని ఆకాంక్షిస్తూ మేడేను జరుపుకుంటున్నాం. ఆమెరికా, యూరప్‌ దేశాలలో 19వ శ‌తాబ్దంలో పారిశ్రామిక విప్లవం కారణంగా భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పనిచేయుట‌కు కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తిరంగంలోని పెట్టుబడిదారులు, కార్మికులు రెండు వర్గాలు పుట్టాయి. పెట్టుబడిదారులు అధిక లాభాలకోసం కార్మికులు శ్ర‌మ‌ను దోచుకోవ‌డం మొద‌లు పెట్టారు.

శ్రామికులచే బానిసల్లా ప‌నిచేయించేవారు. పిల్లలు మ‌హిళ‌లు అనే విచక్షణలేకుండా కర్మాగారాలలో, గనులలో గొడ్డు చాకిరీ చేయించేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, గూడు వంటి ఉండేవి కాదు. రోజుకు 16 గంటలపైగా పనిచేయించేవారు. కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించే వారు. ఈ దారుణ చర్యల నేపధ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు అంకురించింది. కార్మికులు కోపంతో యంత్రాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వాలను య‌జమానులు ఆశ్ర‌యించారు. ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యంత్రాలను ధ్వంసంచేసేవారికి మరణ శిక్ష విధిస్తూ చట్టం చేసింది. యామానుల‌పై తిరుగుబావుటా ఎగ‌ర‌వేశారు.

గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఉన్న పెట్టుబ‌డిదారుల‌పై ఉధ్య‌మాల‌కు కార్మికులు సంఘటితమయ్యారు. కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారు. 1764-1800 మధ్య బ్రిటన్‌లోనూ, ఆ తరువాత యూరప్‌లోనూ, ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో కార్మికులు చైతన్యవంతులై 1806లో మెకానిక్స్‌ యూనియన్‌ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకొన్నారు. పనిగంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని.. కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్‌, ఫ్రాన్సు, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి.

ఫిలడెల్ఫియాలో మెకానిక్స్‌ యూనియన్ 1827లో త‌మ‌కు 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించాయి. ఈ ఉథ్య‌మం దావాలంగా వ్యాపించింది. ఈ ఉధృతం కావడంతో యాజమాన్యం దిగివచ్చింది. ప్రభుత్వం 1837లో 10 గంటల పనిదినంను చట్టబద్ధం చేసింది.

1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ పేరిట ఒక సమాఖ్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమాఖ్య 1884 అక్టోబరు 7న ఎనిమిది గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసింది. 1886 మే మొదటి తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించింది. 1885-86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మెపోరాటాల్లో లక్షలాది కార్మికులు పాల్గొన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్‌నేషనల్‌ మహాసభ కూడా రోజుకు 8 గంటలు పనిని చట్టబద్ధం చేయాలని కోరింది. 1886 మే 1న చికాగోలో 8 గంటల పనిదినం సమ్మె జరిగింది. మూడున్నర లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో కార్మికులపై మే 3న కాల్పులు జరిపింది. ఆరుగురు కార్మికులు అమరులయ్యారు. కొంద‌రిని ప‌ట్టుకొని ఉరి తీశారు.

మే1న ప్రారంభమైన మహోద్యమం బాల్టిమెన్‌, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌, పిట్సు, డెట్రాన్‌ వంటి పెద్ద నగరాలకు దావానలంలా వ్యాపించింది. కార్మికుల హక్కుల కోసం వీరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేశారు. 1889న సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ రెండవ ఇంటర్‌నేషనల్‌ మే 1వ తేదీన కార్మిక దినోత్సవం ప్రకటించింది. ఆ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. 1890 మే 1వ తేదీన ఐరోపా దేశాలలో తొలిసారిగా మేడే జరపడం జరిగింది. మనదేశంలో కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన మతతత్వం, నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళజాతి సంస్థల దోపిడీ నుంచి కాపాడుకునేందుకు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు పోరాటాన్ని కొన‌సాగిస్త‌న్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories