అదో పెంపుడు పైథాన్‌

అదో పెంపుడు పైథాన్‌
x
Highlights

జంతువుల మీద ప్రేమ ఉన్న చాలామంది తమ ఇండ్లలో జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఆ జంతువులలో కూడా ఎక్కువగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, విదేశాలలో నైతే పందులను...

జంతువుల మీద ప్రేమ ఉన్న చాలామంది తమ ఇండ్లలో జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఆ జంతువులలో కూడా ఎక్కువగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, విదేశాలలో నైతే పందులను కూడా పెంచుకుంటారు. పల్లెటూర్లలో ఆవులు, గేదెలు, మేకలు లాంటి జంతువులను పెంచుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పామునే పెంచుకున్నాడు. వింటుంటే ఇదేం పిచ్చి అనుకుంటున్నారు కదూ. కానీ అది ముమ్మాటికీ నిజం.

ఇంగ్లాండ్‌లోని ట్యూక్స్‌బరీలో నివసిస్తున్న మార్కస్‌ హబ్స్‌ అనే 31 ఏళ్ల యువకుడు తన ఇంట్లో భారీ కొండచిలువను పెంచుతున్నాడు. మార్కస్‌కు పెళ్లయి ఇద్దరు కొడుకులు భార్య ఉన్నారు. అయినప్పటికీ తనకు పాములమీద ఉన్న ఇష్టంతో 18 అడుగుల కొండచిలువను పెంచుకుంటున్నాడు. ఆ కొండచిలువకు ముద్దుగా హేస్కియో అని పేరు కూడా పెట్టాడు. తన కుటుంబంలో ఒక వ్యక్తిగా చూసుకోవడమే కాకుండా, తన ఇంట్లో దాని కోసం ఒక ప్రత్యేకమైన గదిని కూడా ఏర్పాటు చేశాడు. తమ పిల్లలను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటారో హేస్కియోని అంతే జాగ్రత్తగా చూసుకుంటారు.

ఇప్పటి వరకూ ప్రపంచంలో 18.8 అడుగుల కొండ చిలువే అతి పొడవైనదిగా రికార్డుల్లో ఉంది. కానీ తాజాగా హేస్కియో పొడవును కొలవగా అది 18 అడుగులు ఉందని, త్వరలో ఇది మరింత పొడవు పెరుగుతుందని మార్కస్‌ హబ్స్‌ చెపుతున్నాడు. ప్రస్తుతం దాని బరువు 110 కిలోలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories