Malala Yousafzai: వివాహం చేసుకున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా

Malala Yousafzai Got Married Asser Malik
x

నోబెల్ బహుమతి గ్రహీత మలాలా పెళ్లి (ఫైల్ ఇమేజ్)

Highlights

Malala Yousafzai: బ్రిటన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిఖా

Malala Yousafzai: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా పెళ్లిపీటలెక్కారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తున్న మలాలా కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మలాలా.. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజన్నారు. అస్సర్, తాను జీవిత భాగస్వాములమయ్యామని, తమ నిఖా నిరాడంబరంగా జరిగిందని పేర్కొన్నారు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం సాగించడానికి సంతోషంగా ఉన్న తమకు ఆశీస్సులు పంపాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories