Top
logo

హవ్వ..స్మశానంలో సర్వం మరిచి ఆ ప్రేమికుల సిగ్గుమాలిన పని!

హవ్వ..స్మశానంలో సర్వం మరిచి ఆ ప్రేమికుల సిగ్గుమాలిన పని!
X
Highlights

వెధవ పనులు చేయడానికి ఎక్కడైనా రెడీ అంటారు ప్రేమికులుగా చెప్పుకునేవారు. వారి రోమాన్స్ కి ప్రదేశాలతో పని ఉండదు. అయితే, ఈ జంట మాత్రం అన్నీ మర్చిపోయి స్మశానం లోని సమాదులనే బెడ్ గా చేసేసుకున్నారు. అక్కడే తన రోమాన్స్ కానిచ్చేశారు. ప్రపంచాన్ని మర్చిపోయి.

వెధవ పనులు చేయడానికి ఎక్కడైనా రెడీ అంటారు ప్రేమికులుగా చెప్పుకునేవారు. వారి రోమాన్స్ కి ప్రదేశాలతో పని ఉండదు. అయితే, ఈ జంట మాత్రం అన్నీ మర్చిపోయి స్మశానం లోని సమాదులనే బెడ్ గా చేసేసుకున్నారు. అక్కడే తన రోమాన్స్ కానిచ్చేశారు. ప్రపంచాన్ని మర్చిపోయి.

ఐర్లాండ్ లోని కార్క్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ఎలా బయటపడిందో తెలుసా. అక్కడి సెయింట్ మైఖేల్ సిమెట్రీ లో తన తల్లి సమాధిని చూసేందుకు ఓ మహిళ వెళ్ళింది. ఆమెకు అక్కడ కలలో కూడా ఊహించని దృశ్యం కనిపించింది. ఇద్దరు ప్రేమికులు అక్కడి ఓ సమాధి మీద సెక్స్ లో ఉన్నారు. అసలు ప్రపంచాన్నే మర్చిపోయి అక్కడ వారు చేస్తున్న రాతిక్రీడను ఆమె తన మొబైల్ లో వీడియో తీసింది. దానిని రెడ్ ఎఫ్ఎంలో వచ్చే 'నెయిల్ ప్రెండెవిల్లే షో'కు పంపింది.

''హాయ్ నెయిల్, గత రాత్రి నేను నా తల్లి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లాను. ఆ సమయంలో ఓ జంట సమాధులపై సెక్స్ చేసుకుంటూ కనిపించారు. వాళ్లను చూడగానే నేను భయపడ్డాను. ఆ టైమ్‌లో వాళ్లు అదేం పని అనిపించింది. వాళ్లు నన్ను చూసి కూడా పట్టించుకోలేదు. వాళ్ల పనిలో వాళ్లు సీరియస్‌గా నిమగ్నమై ఉన్నారు. వాళ్లు ఆ పాడుపని నా తల్లి సమాధిపై చేసి ఉంటే ఏం చేసేదాన్నో నాకే తెలియదు. వాళ్లకు సిగ్గురావాలనే ఉద్దేశంతో ఆ వీడియో తీసి మీకు పంపిస్తున్నా. బహుశా కుక్కలు కూడా సంస్కారాన్ని మరిచి ఇలాంటి పని చేయవేమో'' అని ఆ మహిళ వ్యాఖ్యానించింది.

''అది చూసిన తర్వాత.. నా తల్లిని అక్కడ ఎందుకు పూడ్చి పెట్టానా అని సిగ్గుగా ఉంది'' అని భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనపై ఆ శ్మశాన వాటిక అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ''ఈ ఘటన గురించి విన్నాను. కానీ, ఆ మహిళ తీసిన వీడియోను చూడలేదు. శ్మశానంలో మొత్తం ఏడు నిఘా కెమేరాలు ఉన్నాయి. ప్రధానంగా అవి మెయిన్ గేట్ వైపే ఉంటాయి. లోపల ఉన్న వాటికి విద్యుత్తు సరఫరా లేకపోవడం పనిచేయడం లేదు. వాటిని మరమ్మతు చేసి భవిష్యత్తులో ఇలాంటివి చోటుచేసుకోకుండా జాగ్రత్తపడతాం'' అని తెలిపారు.

ఐర్లాండ్‌లో చనిపోయిన వ్యక్తులను ఎంతో గౌరవిస్తారు. వాటిని పవిత్ర ప్రాంతాలుగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ఆ జంట శృంగారంలో మునిగి తేలడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి వివరాలు తెలుసుకుని చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటువంటి ప్రత్యేకమైన ప్రపంచ వార్తలు మరిన్నిటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story