America: అమెరికాలో రిటైర్ మెకానిక్‌కి లాటరీ

Lottery For Retired Mechanic In America
x

America: అమెరికాలో రిటైర్ మెకానిక్‌కి లాటరీ

Highlights

America: రూ.328 కోట్లు గెలుచుకున్న ఎర్ల్‌‌లాపే

America: అమెరికాలో విశ్రాంత మెకానిక్‌ పంట పండింది. అయోవా లాటరీలో ఆయన కొన్న టికెట్‌ సుమారు 328 కోట్ల రూపాయల బహుమతికి ఎంపికైంది. అయోవా రాష్ట్రంలోని డబ్యూక్‌ నగరానికి చెందిన ఎర్ల్‌ లాపే ఏప్రిల్‌ ఒకటో తేదీన లొట్టో అమెరికా టికెట్‌ కొనుగోలు చేశారు. దానికి తాజాగా 40 మిలియన్‌ డాలర్ల బహుమతి లభించింది. దీంతో ఆయన ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

మొదట ఇదో జోక్‌ అనుకున్నానని ఏప్రిల్‌ ఫూల్‌ అవుతానేమోనని అనుకున్నానని అని క్లైవ్‌లోని అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో బహుమతిని స్వీకరించిన అనంతరం ఎర్ల్‌ లాపే వ్యాఖ్యానించారు. బహుమతి మొత్తాన్ని ఒకేసారి తీసుకునే ఆప్షన్ ను ఆయన ఎంచుకున్నారు. దీంతో ఆయనకు 174 కోట్ల రూపాయలు మాత్రమే లభించాయి. అలాకాకుండా ఏడాదికి కొంతమొత్తం చొప్పున తీసుకుంటే 29 సంవత్సరాల్లో 328 రూపాయలు లభించేవి. తనకు లభించిన సొమ్మును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతోపాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు వెచ్చిస్తానని ఈ సందర్భంగా లాపే తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories