లాక్‌డౌన్ లో వరించిన లక్ష్మీ.. లాటరీ టికెట్‌కి బంపర్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గురు భారతీయులు..

లాక్‌డౌన్ లో వరించిన లక్ష్మీ.. లాటరీ టికెట్‌కి బంపర్ ప్రైజ్ గెలుచుకున్న ముగ్గురు భారతీయులు..
x
Representational Image
Highlights

లాక్ డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బ తిన్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో భవిష్యత్తేంటో తెలియని టెన్షన్ మధ్య ఓ సామాన్యుడిని అదృష్టదేవత వెతుక్కుంటూ వచ్చి వరించింది.

లాక్ డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బ తిన్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో భవిష్యత్తేంటో తెలియని టెన్షన్ మధ్య ఓ సామాన్యుడిని అదృష్టదేవత వెతుక్కుంటూ వచ్చి వరించింది. అతన్ని కోటీశ్వరుడిని చేసింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తర కేరళలోని కన్నూర్‌కి చెందిన జిజేష్ కోర్త్ భార్య, కూతురితో రస్ అల్ ఖైమాలో 15 ఏళ్లుగా నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నాడు. అయితే జీజేష్ కు ఎప్పుడు నిరాశే. వ్యాపారం దెబ్బతింది. లాటరీ టికెట్ కోనాలనే ఆశ మాత్రం చావలేదు. దీంతో ఒక్కడే కొనేంత డబ్బు లేకపోవడంతో... తన ఫ్రెండ్సైన షన్నోజ్, షాజెహాన్ దగ్గర కూడా డబ్బు తీసుకొని కొన్నాడు.

చాలా రోజులుగా ఆశగా ఎదురు చూసాడు. ఇక లాటరీ గెలుస్తామన్న నమ్మకం వారికి లేదు. లాటరీ టికెట్‌ను ఇంట్లో ఓ మూల అలా వదిలేశాడు. తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇటీవలే అబూదాబిలో లాటరీ డ్రా తీశారు. ఈ సంగతి కూడా జిజేష్‌కి తెలియదు. ఒక రోజు అనుకోకుండా లాటరీ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఫస్ట్ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని చెప్పారు. అప్పటికి జిజేష్‌ నమ్మలేదు. స్నేహితులు ఆట పట్టిస్తున్నారని అనుకున్నాడు. దీంతో సదరు సంస్థ ఆ టికెన్ వెతికి దానిపై నంబర్ చెక్ చేసుకోండి అని కాల్ కట్ చేశారు.

ఆ తర్వాత లాటరీ టికెట్ కోసం ఇల్లంతా గాలించాడు. ఓ మూల నలిగిపోయిన టికెట్ కనిపించింది. దానిపై నంబర్ 041779 అని ఉంది. తనకు కాల్ చేసిన వ్యక్తి వాట్సాప్‌లో పంపిన నంబర్ సరిచూసుకున్నాడు. ఫస్ట్ ప్రైజ్ మనీ రూ.41.50 కోట్లు కొట్టేశారు. బీజేష్ ఆనందానికి అదుపులేదు.దీనిపై అక్కడ టాక్స్ కూడా లేదు. మొత్తం డబ్బు చేతికొస్తుంది. ఒక్కసారిగా వారి జీవితం మారిపోయినట్లే. లాటరీ డబ్బును తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి సమానంగా పంచుకుంటామని తెలిపాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories