లాక్ డౌన్ : "భూమి" కదలికల్లో గణనీయమైన మార్పులు

లాక్ డౌన్ : భూమి కదలికల్లో గణనీయమైన మార్పులు
x
Highlights

భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారా, ఇతర ఆధారాల ద్వారా పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది.

భూమి సౌరకుటుంబం లోని గ్రహాల్లో ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారా, ఇతర ఆధారాల ద్వారా పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై, ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.

మానవ నాగరికతకు దూరంగా, వాహనాలు ఫ్యాక్టరీలు, వరాణా వ్యవస్థలు, రైల్లు, విమానలు ఇలా అన్ని పెరిగిపోవడంతో భూమిపై కాలుష్యం పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి కపించే స్థాయి కన్నా ఎక్కువ శాతం కంపిస్తుంది. దీంతో ఎన్నో విపత్తులు సంభవిస్తున్నాయి. భూకంపాలు, సునామీలు వంటి విపత్తులు సంభవిస్తున్నాయని తెలుపుతున్నారు.

కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను గందరగోళంలో పడేసింది. ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు లాక్ డౌన్ ను విధించింది. దీంతో పరిశ్రమాలు, రవాణా సదుపాయాలు అన్ని స్థంబించి పోయాయి. దీంతో మన భూమి కదలికల్లో మార్పులు వచ్చాయని, భూ ప్రకంపనలు తక్కువగా ఉన్నాయని ప్రముఖ వెబ్ సైట్ ది నేచర్ లో తెలిపారు. భూకంపాలు వంటి సహజ సంఘటనలు భూమి పొరలు కదలడానికి కారణమైనట్లే, కదిలే వాహనాలు, పారిశ్రామిక యంత్రాల వల్ల కూడా కంపనాలు కలుగుతాయని తెలిపారు.

భూమి యొక్క కదలికను అధ్యయనం చేసే భూకంప శాస్త్రవేత్తలు భూకంప శబ్దాలు, భూమి కంపనాలు తగ్గుతున్నట్లు నివేదిస్తున్నారు. దీంతో భూ గ్రహం నిశ్చల స్థితిలో ఉందని తెలుపుతున్నారు. బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీలో భూవిజ్ఞాన శాస్త్రవేత్త, భూకంప శాస్త్రవేత్త థామస్ లెకోక్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమలు చేసిన కారణంగా భూకంప శబ్దంలో 30 నుంచి 50 శాతం దేశ రాజధాని బ్రస్సెల్స్ ప్రాంతంలో తగ్గినటు గుర్తించారని సిఎన్ఎన్ నివేదికలో వెల్లడించారని తెలిపారు.

భూకంప శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం భూమి ప్రకంపనల్లో మార్పులు రావడం, ఎక్కువ శాతం రణగొణ ధ్వనులు లేనందున భూమి పైన ఏ చిన్న శబ్దం సంభవించినా దాన్ని సులభంగా గుర్తించగలుతున్నామన్నారు. సూక్ష్మ స్థాయిలో భూ ప్రకంపణలు వచ్చినా దాన్ని గుర్తించగలం అని నిపుణులు అంటున్నారు. దీని ద్వారా అతి చిన్న శబ్దాన్ని వినగలుగుతున్నామని, తక్కువ శబ్దంతో కూడిన సిగ్నల్స్ పొందుతున్నామని వాషింగ్టన్ డిసీలోని ఇన్కార్పొరేటెడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్స్ ఫర్ సీస్మోలజీ భూకంప శాస్త్రవేత్త ఆండీ ఫ్రాస్సెట్టో తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories