బైడెన్‌, కమలా హారిస్‌ ప్రమాణం వేళ.. ఉర్రూతలూగించనున్న జెన్నిఫర్‌ లోపెజ్‌

బైడెన్‌, కమలా హారిస్‌ ప్రమాణం వేళ.. ఉర్రూతలూగించనున్న జెన్నిఫర్‌ లోపెజ్‌
x
Highlights

-ఈ నెల 20న జో బైడెన్‌, కమలా హారిస్‌ ప్రమాణస్వీకారం -అధ్యక్షుడిగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణస్వీకారం

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా డెమొక్రాట్‌ నేతలు జో బైడెన్, కమలా హారిస్‌లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో ప్రఖ్యాత కళాకారులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ గాయని లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. మరో గాయని, నృత్యకారిణి, నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ సంగీత కచేరీ కూడా ఉంటుంది. కొవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో... వీటిలో చాలా కార్యక్రమాలు వర్చ్యువల్‌ విధానంలోనే ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.

సైనిక కుటుంబాల కోసం ఉద్దేశించిన 'జాయినింగ్‌ ఫోర్సెస్‌' కార్యక్రమ కార్యనిర్వాహక అధికారిగా... జో సీనియర్‌ సలహాదారు రోరీ బ్రోసియస్‌ పేరును బైడెన్, జిల్‌ దంపతులు ప్రకటించారు. ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అడ్మినిస్ట్రేటర్‌గా న్యూయార్క్‌ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ డియన్నె క్రిస్‌వెల్‌ను నామినేట్‌ చేశారు. తదుపరి ప్రథమ మహిళ డిజిటల్‌ విభాగ డైరెక్టర్‌గా భారత సంతతి అమెరికన్‌ గరిమా వర్మ, మీడియా కార్యదర్శిగా మైఖేల్‌ లారోసా పేర్లను నామినేట్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌-హారిస్‌ ప్రచార కార్యక్రమాలకు గరిమా జన సమీకరణ వ్యూహాలు రచించారు. బైడెన్‌ కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమైన 'నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌' డిప్యూటీ డైరెక్టరుగా కశ్మీర్‌ మహిళ సమీరా ఫాజిల్‌ను బైడెన్‌ ఎంపిక చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories