రోజుకు 20 స్లీపింగ్ పిల్స్ మింగుతున్న కొరియన్లు...

Koreans Consume 20 Sleeping Pills a Day | Telugu Online News
x

రోజుకు 20 స్లీపింగ్ పిల్స్ మింగుతున్నకొరియన్లు

Highlights

South Korea: పని ఒత్తిడితో నిద్ర రాక పిచ్చెక్కిపోతున్న దక్షిణ కొరియా ప్రజలు

South Korea: పని.. పని..పని.. నిరంతరం పనితోనే దక్షిణ కొరియా వాసులు అలసి సొలసిపోతున్నారు. పని ఒత్తిడితో ప్రభుత్వం ప్రజలను టార్చర్ పెడుతుంటే స్లీపింగ్ పిల్స్ కు అలవాటు పడుతున్నారు అక్కడి జనం డిప్రెషన్లు, ఆత్మహత్యల్లో ప్రపంచంలోనే ముందున్న దక్షిణ కొరియా ముందు ముందు మరింత ప్రమాదంలో పడిపోతోందా?

దక్షిణ కొరియా ప్రజలు నిద్రలేమితో అల్లాడుతున్నారు. ప్రపంచంలోనే నిద్రకరువైన దేశంగా ఆ దేశం రికార్డుల కెక్కుతోంది. విపరీతమైన పని ఒత్తిడి, సుదీర్ఘమైన పనివేళలు అక్కడి ప్రజలకు నిద్రను కరువు చేసేశాయి. రోజంతా ఆఫీసు కార్యాలయాల్లో ఒంచిన నడుం ఎత్తకుండా పనిచేయడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుందేమో కానీ ప్రజారోగ్యం మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. సగటున ఆ దేశంలో ఉదయం ఏడుగంటలనుంచి రాత్రి 10 గంటల వరకూ ఉద్యోగులు పని చేస్తూనే ఉంటారు. ఇది కాక ప్రవేటు సంస్థల్లో అయితే బాస్లు ఓక్కోసారి అర్ధరాత్రి సైతం ఫోన్ చేసి అర్జెంటుగా పని పూర్తి చేయమని అడుగుతుంటారు.

దాంతో అక్కడి ఉద్యోగులు రిలాక్సేషన్ అంటేనే మర్చిపోయారు. విపరీతమైన పని గంటలు కంటికి కునుకు రాకుండా చేస్తున్నాయి. నిద్రకోసం కొందరు స్లీపింగ్ పిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. అదీ ఎంతలా అంటే రోజుకు 20 పిల్స్ వేసేసుకుంటున్నారు. సాధారణంగా మనం పడుకుంటే గాఢనిద్రలోకి జారడానికి కొంత టైమ్ పడుతుంది. కానీ కొరియన్లకు సమయం తక్కువ విపరీతమైన పని ఒత్తిడి దాంతో కావలసినప్పుడు నిద్ర వచ్చేందుకు ఇలా స్లీపింగ్ పిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు నిద్ర రాక ఆల్కహాల్ కూడా సేవిస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

దక్షిణ కొరియాలో దేశ వ్యాప్తంగా ఇప్పుడు నిద్ర లేమి వేధిస్తోంది. దాదాపు లక్షమంది కొరియన్లు ఈ పిల్స్ కు అడిక్ట్ అయ్యారన్నది సర్వేల సారాంశం. ఇన్ సోమ్నియాతో బాధపడుతున్న జనం సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరుగుతోంది. పదేళ్లుగా కంటి మీద కునుకులేని వారున్నారు. ఇలా నిద్ర సైకిల్ దెబ్బతిని కొందరు నిద్రలోనే డ్రైవింగ్ చే్స్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటే మరికొందరు నిద్ర మధ్యలో లేచి ఫ్రిజ్ లో దొరికినవి తినేస్తూ బరువు పెరుగుతున్నారు. దక్షిణ కొరియాలో ఆత్మ హత్యలు కూడా ఎక్కువే. డిప్రెషన్ తగ్గడానికి మందుల వాడకం, హెవీ మోతాదులో లిక్కర్ తాగడం ఎక్కువవుతోంది.

సౌదీ అరేబియా లాంటి దేశాలు సహజవనరుల ఆధారంగా అభివృద్ధి చెందుతుంటే వనరు లు లేని దక్షిణ కొరియా ప్రజల కష్టం మీదే ఆధారపడుతోంది. కష్టపడే తత్వమే జాతీయవాదంగా రూపుదిద్దుకుని ఆదేశాన్ని ముందుకు నడుపుతోంది. ఇంతవరకూ బానే ఉన్నా నిద్రలేమితనం భవిష్యత్తులో దేశ జీడీపీని కూడా నష్టపరచినా ఆశ్చర్యపోనక్కరలేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఓవర్ స్ట్రెయిన్ వల్ల జీవన ప్రమాణాలు దెబ్బతిని త్వరగా అలసిపోవడం ఆయు: ప్రమాణాలు తగ్గిపోతాయని వారంటున్నారు.

దక్షిణ కొరియాలో ఇప్పటికే రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల వ్యాపారం సాగుతోంది. సియోల్ లో డిపార్టుమెంటల్ స్టోర్స్ లో స్లీప్ ప్రొడక్స్ట్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇక ఫార్మసీలలో హెర్బల్ స్లీప్ టానిక్స్ అమ్ముడవుతున్నాయి. నిద్రకోసం కొక్కిరి అనే మెడిటేషన్ యాప్ కూడా అక్కడ వాడుకలో ఉంది. అనేక మెడిటేషన్ క్లినిక్కులూ వెలుస్తున్నాయి. మొత్తానికి నిద్ర కోసం కొరియన్లు అష్ట కష్టాలు పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories