కిమ్‌ గుర్రపు స్వారీ దేనికి సంకేతం?

కిమ్‌ గుర్రపు స్వారీ దేనికి సంకేతం?
x
Highlights

కివ్ జోంగ్ కొరియాలోనే ప్రమాదకర పర్వతమైన మౌంట్‌ పయేక్టు వెళ్లీ గుర్రపు స్వారీ చేశారు. తెల్లటి గుర్రంపై ఎక్కి మంచుతో కప్పబడిన పయేక్టు పర్వతంపై షికారు చేసిన ఫోటోలు బయటపడ్డాయి.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తెలియని వారు ఎవరూ ఉండరు. సంచలన నిర్ణయాలకు కేంద్రబిందువు కిమ్, అమెరికాపై కాలు దువ్వినా.., మళ్లీ ట్రంప్ తో చర్చలు జరిపినా ఆయనకే సాథ్యం. అటువంటి కివ్ జోంగ్ కొరియాలోనే ప్రమాదకర పర్వతమైన మౌంట్‌ పయేక్టు వెళ్లీ గుర్రపు స్వారీ చేశారు. తెల్లటి గుర్రంపై ఎక్కి మంచుతో కప్పబడిన పయేక్టు పర్వతంపై షికారు చేసిన ఫోటోలు బయటపడ్డాయి. కిమ్ వంశీకులు పర్వతాన్ని ఆధ్యాత్మికమైన ప్రదేశంగా భావిస్తారు.ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సాహస యాత్రలు చేస్తారని ఆయన సహాయలు చెబుతున్నారు.

ప్రపంచ దేశాలల్నిఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అధ్యక్షుడు కిమ్‌ మాత్రం గుర్రపు సవారీ చేస్తూ ఉన్నారు. దైర్యంగా ఉండాలని కిమ్ ఇలాంటి సంకేతాలు ఇస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా కిమ్ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షించడానికి పయేక్టు పర్వత సందర్శనకు వెళ్లారు. 2018లో దక్షిణ కొరియాతో జరిగిన శిఖరాగ్ర సమావేశం సమయంలో ఆ దేశా అధ్యక్షడుని మూన్‌-జే-ఇన్‌ను కూడా పయేక్టు పర్వతానికి తీసుకెళ్లారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories