Israel-Iran Conflict: కాల్పుల విరమణను నిరాకరించిన ఇరాన్..దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయెల్..బంకర్ లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!

Khamenei reports from bunker in northeast Tehran telugu news
x

Israel-Iran Conflict: కాల్పుల విరమణను నిరాకరించిన ఇరాన్..దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయెల్..బంకర్ లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!

Highlights

Israel-Iran Conflict: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులను ముమ్మరం చేసింది. టెల్ అవీవ్‌లో నిరంతరం సైరన్‌లు మోగుతున్నాయి.

Israel-Iran Conflict: ఇరాన్ స్థానిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులతో టెహ్రాన్ లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈశాన్య టెహ్రాన్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఖమేనీ నివాసంతోపాటు ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ గత శుక్రవారం అర్థరాత్రి వైమానిక దాడులకు పాల్పడింది. ఖమేనీ నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేలుళ్లు జరిగినట్లు టెహ్రాన్ మీడియా కథనాలు తెలిపాయి. ఆదివారం కూడా ఈ ప్రాంతంలో మరోమారు పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఖమేనీ సురక్షితంగా లేరని అధికారులు భావించి వెంటనే లావిజాన్ లోని బంకర్ కు ఆయనను తరలించినట్లు సదరు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. కాగా గత ఏడాది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ ఖమేనీ కుటుంబంతో సహా బంకర్ లోకి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కాగా ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదటి రోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని ఇజ్రాయెల్ మొదట భావించినట్లు తెలుస్తోంది. కానీ అణు శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని నెతన్యాహు సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేవలం హెచ్చరికగా మాత్రమే ఖమేనీ నివాసం సమీపంలో దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories