కశ్మీర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించం : బ్రిటన్ ప్రతిపక్ష పార్టీ

Uk   Labour Party
x
Uk Labour Party
Highlights

కశ్మీర్ అంశంపై బ్రిటన్ ప్రతిపక్ష పార్టీ వెనకడుగు వేసింది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ జోక్యం కోసం బ్రిటన్ లేబర్ పార్టీ కోరడాన్ని భారత్ ప్రభుత్వం...

కశ్మీర్ అంశంపై బ్రిటన్ ప్రతిపక్ష పార్టీ వెనకడుగు వేసింది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ జోక్యం కోసం బ్రిటన్ లేబర్ పార్టీ కోరడాన్ని భారత్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బ్రిటన్ కు చెందిన లేబర్ పార్టీ ఈ చర్యలకు దిగిందని భారత్ విదేశాంగ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నా విషయం తెలిసిందే.

అయితే తాజాగా లేబర్ పార్టీ ఈ అంశంపై వెనక్కి తగ్గింది. బ్రిటన్ లో భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో లేబర్ పార్టీ అభిప్రాయాన్ని మార్చుకుంది. ఇతర దేశాలకు చెందిన అంతర్గత వ్యవహారాల్లో తాము కలుగజేసుకోవమని తెలిపింది. ఈ మేరకు లేబర్ పార్టీ చైర్మన్ ఇయాన్ లావెరీ ఓ ప్రటనలో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ పూర్తిగా ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిశీలకులను అనుమతి ఇవ్వాలని పార్లమెంట్ లో చేసిన తీర్మానం భావోద్వేగంతో తీసుకోవాల్సి వచ్చిందని విరవణ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించబోమని ప్రకటనలో పేర్కొన్నారు.

కశ్మీర్ లో అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని ఐక్కరాజ్యసమితి నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని బ్రిటన్ ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ నేత కోర్బన్ సెప్టెంబరులో డిమాండ్ చేశారు. అక్కడి పార్లమెంట్ లోనూ తీర్మానం పెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories