Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలా హారిస్

Kamala Harris may run for California Governor
x

Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలా హారిస్

Highlights

Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్‌గా కమలా హారిస్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయమై కొన్ని త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్‌గా కమలా హారిస్ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విషయమై కొన్ని త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకోనున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేసి ఓడిపోయారు. కాలిఫోర్నియా గవర్నర్ గా గావిన్ న్యూసమ్ ఉన్నారు. కాలిఫోర్నియా లో డెమోక్రట్ల ఆధిపత్యం ఉంటుంది. దీంతో కాలిఫోర్నియా గవర్నర్ గా పోటీకి దిగితే కమలా హారిస్ సులభంగా విజయం సాధించే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

2028 డెమోక్రటిక్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఆమె కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీ నుంచి తప్పుకున్న తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. 107 రోజుల్లోనే ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ట్రంప్ నకు గట్టిపోటీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఎన్నికల్లో ట్రంప్‌నకే అమెరికన్లు పట్టం కట్టారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆమె ప్రజలకు దూరంగా ఉన్నారు.

బైడెన్ అధ్యక్షుడిగా, కమలాహారిస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఉపాధ్యక్షురాలిగా ఉంటూనే చివరి నిమిషంలో ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories