Joe Biden: అందుకు భద్రతా బృందం నో.. తొలిరోజే మనోభీష్టాన్ని వదులుకోనున్న బైడెన్

Joe Biden will be inaugurated on Wednesday
x

Joe Biden ఫైల్ ఫోటో 

Highlights

బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.అయితే తొలి రోజు బైడెన్‌ తన ఇష్టాన్ని వదులుకోవాల్సి వస్తోంది. తన జీవితంలో ఎన్నో సుఖాలు, కష్టాలకు సాక్ష్యమైన రైలు ప్రయాణాన్ని వదులుకోవాల్సి వస్తోంది. సుమారు 40 సంవత్సరాలు ఎన్నో విలువైన అనుభూతుల్ని మిగిల్చిన రైల్లోనే.. అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వెళ్లలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ కోరిక తీరకుండా పోతోంది.

జనవరి 20న అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు డెమొక్రాటిక్​ నేత జో బైడెన్​. ప్రమాణ స్వీకారం చేయనున్న వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయితే, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జో బైడెన్​ తొలిరోజే తన ఇష్టాన్ని వదులుకోవాల్సి వస్తోంది. ప్రమాణస్వీకారానికి తనకిష్టమైన.. దాదాపు 40 ఏళ్లపాటు రోజూ తాను ప్రయాణించిన రైలులో రావాలని బైడెన్‌ నిర్ణయించుకున్నారు. తన సొంత ఊరైన డెలవర్ రాష్ట్రంలోని విల్​మింగ్టన్ పట్టణం నుంచి వాషింగ్టన్​లో ప్రమాణ స్వీకారానికి అమెరికా రైల్వే వ్యవస్థ రైలులో ప్రయాణించాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. కానీ.. తీరా.. ముహూర్తం వేళకు భద్రతా బృందం నో చెప్పింది. క్యాపిటల్ భవనం వద్ద చెలరేగిన అల్లర్లు, ట్రంప్ మద్దతుదారుల హింసాత్మక ఘటనల నేపథ్యంలో బైడెన్‌ తన మనోభీష్టాన్ని వదలుకోవాల్సి వస్తోంది!

అమెరికా సెనెట్‌కు డెలవర్‌ రాష్ట్రం నుంచి సెనెటర్‌గా ఎన్నికైన తర్వాత 1972లో జో బైడెన్‌ జీవితం ఈ రైలుతో ముడిపడిందంట. అప్పుడే ప్రమాదంలో తన తొలి భార్య, కూతురు చనిపోయారు. దీంతో... ఇద్దరు అబ్బాయిలను చూసుకోవటం కోసం... వాషింగ్టన్‌ నుంచి రోజూ రైలెక్కి విలిమింగ్‌టన్‌కు బైడెన్‌ వచ్చేశారు. ఇలా సుమారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అంతేకాదు... 1987లో తొలిసారిగా అధ్యక్ష బరిలోకి దిగినప్పుడు కూడా బైడెన్‌ తన సొంతూరులోని రైల్వే స్టేషన్‌ నుంచే అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. 2011లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు జో గౌరవార్థం- విల్‌మింగ్టన్‌ స్టేషన్‌పేరును... జోసెఫ్‌ ఆర్‌ బైడెన్‌ జూనియర్‌ రైల్‌రోడ్‌ స్టేషన్‌' అని అమెరికా రైల్వే వ్యవస్థ మార్చింది.

బైడెన్‌ జీవితంలో ఎదురైన ఎన్నో సుఖాలు, కష్టాలకు ఈ రైలు సాక్షం. బైడెన్‌కు అమెరికా రైల్వే వ్యవస్థ ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎంతో విలువైన అనుభూతుల్ని మిగిల్చింది. సుమారు 40 సంవత్సరాలు నిరాటంకంగా రైల్లో తిరిగినా... అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించటానికి కూడా ఇందులోనే ప్రయాణించాలన్న కోరిక మాత్రం బైడెన్‌కు భద్రతా కారణాలతో తీరకుండాపోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories