'నేను చావలేదు బతికే ఉన్నా' : మసూద్‌ అజార్‌

నేను చావలేదు బతికే ఉన్నా : మసూద్‌ అజార్‌
x
Highlights

'నేను చావలేదు బతికే ఉన్నా. ఆరోగ్యంగా ఉన్నా. కశ్మీరీలను అణగదొక్కుతున్న భారత్‌పై జిహాద్‌ను ప్రారంభించండి అంటూ జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌...

'నేను చావలేదు బతికే ఉన్నా. ఆరోగ్యంగా ఉన్నా. కశ్మీరీలను అణగదొక్కుతున్న భారత్‌పై జిహాద్‌ను ప్రారంభించండి అంటూ జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. ఈ మేరకు 11.41 నిమిషాల నిడివి గల ఆడియో క్లిప్‌ను జైషే మహ్మద్‌ చాట్‌ ప్లాట్‌ఫాంల్లో అప్‌లోడ్‌ చేశాడు. పాకిస్థాన్‌ ప్రభుత్వం రెండు రోజులనుంచి వరుసగా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటోంది.

నిషేధిత మిలిటెంట్‌ గ్రూపులకు చెందిన 121 మంది సభ్యులను అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో జైష్‌-ఎ-మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజ్‌హర్‌ కుమారుడు హమద్‌, సోదరుడు రవూఫ్‌లు కూడా ఉన్నట్టు పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాలశాఖ గురువారం వెల్లడించింది. ఈ నేపధ్యలో మసీదులు, నిజమైన ముస్లింలపై దర్యాప్తును నిలిపివేయాలని పాక్‌ను హెచ్చరించాడు. ఆడియో క్లిప్‌లో మలాలా గురించి మాట్లాడుతూ.. దేశాన్ని అలాంటి వారి చేతుల్లోకి వెళ్లనివ్వమని హెచ్చరించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories