నాలుగు దేశాలకు 'ఈ-వీసా' రద్దు.. భారత్ పై జపాన్ ఆగ్రహం

నాలుగు దేశాలకు ఈ-వీసా రద్దు.. భారత్ పై జపాన్ ఆగ్రహం
x
Highlights

కరోనావైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని జపాన్ దేశస్థులకు ఇ-వీసాలు అన్నింటిని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై జపాన్ భారత్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

కరోనావైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని జపాన్ దేశస్థులకు ఇ-వీసాలు అన్నింటిని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై జపాన్ భారత్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ వంటి అనేక ఇతర దేశాల పౌరులతో పాటు జపాన్ జాతీయులకు ఇ-వీసాలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ జపాన్.. భారతదేశానికి ఒక డిమార్కి జారీ చేసినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. అందులో ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను విస్మరించి, ఇతర దేశాల ప్రజలతో పాటు జపాన్ జాతీయులను క్లబ్ చేయాలన్న భారత్ నిర్ణయాన్ని జపాన్ గట్టిగా వ్యతిరేకించింది.

భారతదేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా.. వైరస్ ను నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతో అనేక దేశాల ప్రజల ఇ-వీసాలను రద్దు చేయాలని భారత నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో భారత్ తన నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లేదని వారు తెలిపారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా మరియు జపాన్ దేశస్థులకు మార్చి 3 న లేదా అంతకు ముందు మంజూరు చేసిన అన్ని సాధారణ వీసాలు / ఇ-వీసాలను భారత్ మంగళవారం నుంచి నిలిపివేసింది.

ఈ దేశాల్లో కొరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయని నివేదించిన తరువాత ఇటలీ, ఇరాన్, జపాన్ మరియు దక్షిణ కొరియా ప్రజలకు రెగ్యులర్ / ఇ-వీసాలను నిలిపివేశారు. చైనా పౌరులకు ఫిబ్రవరి 5 న లేదా అంతకు ముందు మంజూరు చేసిన రెగ్యులర్ / ఇ-వీసాలను భారత్ నిలిపివేసింది మరియు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణకు సంబంధించిన 31 కేసులు నమోదయ్యాయి, అయితే దాదాపు 29,000 మందిని సంక్రమణ అనుమానం లేదా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నిఘాలో ఉంచారు. భారత్ లో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదని కేంద్ర ప్రభుత్వం.. పలు రాష్ట్రప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories