జపాన్ క్రూయిజ్ షిప్‌లో మరో 70 మందికి 'కరోనావైరస్' పాజిటివ్..

జపాన్ క్రూయిజ్ షిప్‌లో మరో 70 మందికి కరోనావైరస్ పాజిటివ్..
x
Highlights

జపాన్ లోని యోకోహామాలో గత 20 రోజులకు పైగా నిర్బంధంలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో మరో 70 మందికి కరోనావైరస్ (covid-19) కు పాజిటివ్‌ పరీక్షలు నమోదయాయ్యి, దీంతో మొత్తం 355 కేసులను గుర్తించినట్లు ఆరోగ్య మంత్రి కట్సునోబు కటో ఆదివారం ధృవీకరించారు.

జపాన్ లోని యోకోహామాలో గత 20 రోజులకు పైగా నిర్బంధంలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో మరో 70 మందికి కరోనావైరస్ (covid-19) కు పాజిటివ్‌ పరీక్షలు నమోదయాయ్యి, దీంతో మొత్తం 355 కేసులను గుర్తించినట్లు ఆరోగ్య మంత్రి కట్సునోబు కటో ఆదివారం ధృవీకరించారు. కొత్తంగా 289 మందిని పరీక్షిస్తే వారిలో 70 మందికి పాజిటివ్ గా వచ్చాయని, దీంతో మొత్తం పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 1,219 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల మొదట్లో 50 కి పైగా దేశాలు మరియు ప్రాంతాల నుండి 3,711 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో క్రూయిజ్ షిప్ జపాన్ చేరుకున్న సంగతి తెలిసిందే.

కాగా జపాన్ క్రూయిజ్ షిప్‌లో మొత్తం 3,711 మంది ఉన్నారు, వారిలో 138 మంది భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 60 మందికి పైగా వైరస్ సోకినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే 20 రోజులకు పైగా ఆ షిప్ లో ఉన్న వారందరు నిర్బంధంలో ఉన్నారు. వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన మందులను సకాలంలో అందిస్తున్నారు. మరోవైపు షిప్ లో ఉన్న వారికి ఆహార పదార్ధాల్లో కూడా మార్పు చేశారు. రెగ్యులర్ గా వారు తినే ఆహరం కాకుండా లైట్ ఫుడ్.. వాంతులు విరేచనాలు అవకాశం లేని ఆహార పదార్ధాలను మాత్రమే వారికి అందజేస్తున్నారు. షిప్ లో దాదాపు 10 వేల మాస్కులను ఉంచినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి.

ఇదిలావుంటే షిప్ లో చిక్కుకున్న భారతీయులను ప్రస్తుతానికి ఖాళీ చేయలేమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇప్పటికే చెప్పారు. భారతదేశం మరియు విదేశాలలో కరోనావైరస్ పరిస్థితి మరియు పర్యవేక్షణపై జరిగిన సమావేశంలో ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, క్రూయిజ్ షిప్‌లో ఉన్న భారతీయులను ప్రస్తుతానికి తరలించలేమని, వ్యాప్తి చెందకుండా నిరోధించాలనే ఉద్ధ్యేశంతో అక్కడి అధికారులు వారిని నిర్బంధించారని.. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories