గాజాపై వైమానిక దాడులు..ఇజ్రాయెల్ దాడుల్లో 219 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపై వైమానిక దాడులు..ఇజ్రాయెల్ దాడుల్లో 219 మంది పాలస్తీనియన్లు మృతి
x
Highlights

Israel-Gaza:52 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో 40 సొరంగాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్

Israel-Gaza: హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రామెల్ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించడంతో మరో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దాడులను విరమించాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం వెనక్కు తగ్గడం లేదు. హమాస్‌ రాకెట్‌ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది.

మరోవైపుIsraeli bombardment of Gaza, 219 killed.. శత్రులను బలహీనపరిచేందుకు వైమానిక దాడులు మరింత ఉధృతం చేస్తామని తేల్చి చేబుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలోని ఒకే కుటుంబానికి చెందిన 40మంది నివసించే భవనం నేలమట్టం అయింది. ఖాన్‌ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్‌ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 219 మంది పాలస్తీనియన్లు మరణించారు. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక హమాస్‌ రాకెట్‌ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories