కరోనా వైరస్‌ బరువు.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన ఇజ్రాయెల్‌ సైంటిస్టులు

Israel Scientists Reveals the Shocking Things About Coronavirus
x

 వీజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఫైల్ ఇమేజ్)

Highlights

Israel: ఒక గ్రాముకి మించని లక్ష మందిలోని వైరస్‌ల బరువు

Israel: ప్రపంచాన్ని కరోనా తన గుప్పిట్లోకి తీసుకుంది. కోట్లాది మందికి వైరస్‌ సోకగా.. లక్షల మంది బలయ్యారు. ఇంకా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్త వెరియంట్‌లు పుట్టుకస్తూనే ఉన్నాయి. ఇలా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ బరువెంత. ఎన్ని వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్‌ వస్తుంది ? ఈ ప్రశ్నలు మామూలుగానే ఉన్నా సమాధానాలు వింటే మాత్రం కంగుతింటారు.

అసలు ప్రపంచంలో కరోనా వైరస్‌ల సంఖ్య ఎంత.. ఒక పేషెంట్‌ బాడీలో ఎన్ని వైరస్‌లు ఉంటాయని ఇజ్రాయెల్‌ సైంటిస్టులు లెక్కలు వేశారు. వీజ్‌మాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సైంటిస్టులు పలు పరిశోధనలు చేసి, వైరస్‌ల లెక్క తేల్చారు. ఇక ఆ సైంటిస్టులు చెప్పిన లెక్కలు చూసి ప్రపంచ దేశాలు నోరేళ్ల బెడుతున్నాయి. ఒక కరోనా పేషెంట్‌ బాడీలో కొన్ని వందల కోట్ల వైరస్‌లు ఉత్పత్తి అవుతాయట. తీవ్ర లక్షణాలు ఉన్న వారిలో పదివేల కోట్ల వైరస్‌లు ఉంటాయని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే భూమ్మీద ఉన్న మొత్తం మనుషుల సంఖ్య కంటే.. ఒక పేషెంట్‌లో ఉన్న వైరస్‌ కణాల సంఖ్యనే ఎక్కువ అన్నమాట.

వైరస్‌ సంఖ్యను మాత్రమే కాదు.. వెయిట్‌ను కూడా క్యాలిక్‌లేట్‌ చేశారు ఇజ్రాయెల్‌ సైంటిస్టులు. ఒక వైరస్‌ బరువు ఒక ఫెమ్టోగ్రామ్ ఉంటుందట. అంటే ఒక గ్రాములో పది కోట్ల కోట్ల వంతు. ఇంకోలా చెప్పాలంటే.. ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యే వైరస్‌ బరువు. అంటే లక్ష మందిలో ఉన్న వైరస్‌లను తూకంలో పడేస్తే ఒక గ్రాము వెయిట్‌ చూపిస్తుంది.

ఇక ప్రపంచలో ఉన్న కోవిడ్‌ పేషెంట్లలోని వైరస్‌ల వెయిట్‌ను అంచనా వేస్తే మూడు కిలోలకు మించదు. అంటే మూడు కిలోల బరువు ఉండని కణాలు ప్రపంచాన్నే వణికిస్తున్నాయి. పొట్టోడు అయినా గట్టోడు అని విన్నాం. కానీ ఈ బుడ్డది మహా చెడ్డదిలా ఉంది. కంటికే కనిపించని కరోనా ప్రతి కుటుంబాన్ని కంటతడి పెట్టిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories