Israel-Iran War: 12 రోజుల పాటు భీకర యుద్ధం..మరి గెలిచింది ఎవరు?

Israel-Iran War
x

Israel-Iran War: 12 రోజుల పాటు భీకర యుద్ధం..మరి గెలిచింది ఎవరు?

Highlights

Israel-Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య దాదాపు 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. సై అంటే సై అంటూ ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒక తీవ్రంగా క్షిపణిదాడులు చేసుకున్నాయి.

Israel-Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య దాదాపు 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. సై అంటే సై అంటూ ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒక తీవ్రంగా క్షిపణిదాడులు చేసుకున్నాయి. అయితే మధ్యలో నేనున్నానంటూ అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేసింది. ఈ దాడులకు నేనేమీ తీసిపోనని అమెరికాపై ఇరాన్ యుద్ధం చేసింది. అయితే సడన్‌గా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించడంతో ఎట్టకేలకు యుద్ధం ఆగింది. అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరికి లాభం?

యుద్ధం ముగిసింది. మరి గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలో ఎవరికి వారే విజయం సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే అణుక్షేత్రాలను పెంచుకుంటూ వెళుతున్న ఇరాన్‌కు బుద్ది చెప్పానని, అణ్వాయుధ స్థావరాలన్నింటినీ కూల్చివేసి విజయం సాధించానని అమెరికా అనుకుంటుంది. మరో పక్క వైమానిక స్థావరాలు, క్షిపణుల లాంచర్లను నాశనం చేసి విజయం సాదించానని ఇజ్రాయిల్ అనుకుంటుంటే, ఇజ్రాయిల్‌ను మాత్రమే కాదు అమెరికాకు ఎదిరించి ఆయా దేశాల్లో అమెరికా స్థావరాలను మట్టుకరిపించానని ఇరాన్ విజయోత్సవాలు చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు శాంతిదూత అనే పేరు వచ్చింది. కాదు కాదు అతనే ఆ పేరును పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని తానే ఆపానని సోషల్ మీడియాలో తెగ చెప్పుకుంటున్నాడు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేయించి, శాంతిదూతగా వ్యవహరించానని ఆయనకు ఆయనే వెల్లడించుకున్నారు. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినా, దానికి ట్రంప్ ప్రతీకారం తీసుకోకపోవడంతో నిజంగానే ట్రంప్ శాంతి దూతగా వ్యవహరిస్తున్నాడా? అనే అనుమానాలు పబ్లిక్ లో వస్తున్నాయి.

సరే ఈయుద్ధంలో ఎవరికి వారే విజేతలు ప్రకటించుకున్నారు. మరి పశ్చిమాసియా పరిస్థితి ఏంటి? ఇజ్రాయిల్ ,ఇరాన్‌తో పాటు దాడులతో పశ్చిమాసియా కూడా తీవ్రంగా దెబ్బదింతి. మరి దీని పరిస్తితి ఏంటి? ఇప్పట్లో ఇవి కోలుకుంటాయా? దాడులు 12 రోజులు మాత్రమే జరిగాయి. ఇంత తొందరగా ముగియడం చాలా సంతోషకరం అని ఇటీవల ట్రంప్ అన్నారు. నిజంగా ఈ దేశాల్లో దాడులు కేవలం 12 రోజులు మాత్రమే జరిగాయి. పోనీ 12 రోజులు అనుకుంటే.. అక్కడ జరిగిన నష్టం వివరాలు గానీ, ప్రాణ నష్టం వివరాలను గానీ ఇరాన్‌, ఇజ్రాయిల్‌తోపాటు అమెరికా కూడా ఎందుకు వెల్లడించడం లేదు. ఇది ఆలోచించాల్సిన విషమయే కదా.

అసలు ఇంతకీ నిజంగా అక్కడ యుద్ధం ఆగిందా? ఇంకా నడుస్తుందా? ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం ఆగితే అందరికీ మంచిదే. అన్ని దేశాలకు ఇది పెద్ద ఊరటే. కానీ మళ్లీ యుద్దం మొదలైతే? ఈప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అయితే ఈ రెండు దేశాలు నిజంగా శాంతిని కోరుకుంటే వెంటనే ఒక శాంతి ఒప్పందానికి వచ్చి, ఇక ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories