Syria Crisis : ప్రపంచ వినాశనానికి సంకేతం.. సిరియా జైళ్ల నుంచి 22 వేల మంది ఐసీసీ సానుభూతిపరులు మాయం

Syria Crisis : ప్రపంచ వినాశనానికి సంకేతం.. సిరియా జైళ్ల నుంచి 22 వేల మంది ఐసీసీ సానుభూతిపరులు మాయం
x
Highlights

ప్రపంచ వినాశనానికి సంకేతం.. సిరియా జైళ్ల నుంచి 22 వేల మంది ఐసీసీ సానుభూతిపరులు మాయం

Syria Crisis : సిరియా ఎడారి ప్రాంతంలోని ప్రత్యేక క్యాంపుల్లో బంధించిన వేలాది మంది ఇస్లామిక్ స్టేట్ (ISIS) సానుభూతిపరులు, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సుమారు 22 వేల మంది ఒక్కసారిగా నిఘా నీడ నుంచి అదృశ్యం కావడం అంతర్జాతీయ సమాజంలో పెను ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర-తూర్పు సిరియాలో కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ పర్యవేక్షణలో ఉన్న జైళ్లు, క్యాంపుల భద్రత ఒక్కసారిగా కుప్పకూలడమే దీనికి ప్రధాన కారణం.

సిరియా ప్రభుత్వ దళాల ముట్టడితో SDF బలగాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనిని అదునుగా తీసుకున్న కుఖ్యాతి చెందిన అల్-హోల్ క్యాంపులోని ఖైదీలు తిరుగుబాటు చేశారు. కేవలం కొద్ది వారాల్లోనే 24 వేల మందితో కిటకిటలాడిన ఈ క్యాంపు దాదాపు ఖాళీ అయిపోయింది. అక్కడి వారు టెంట్లకు నిప్పు పెట్టి, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి పారిపోయారు. మరికొందరు స్మగ్లర్ల సాయంతో రాత్రికి రాత్రే సరిహద్దులు దాటినట్లు సమాచారం. వీరిలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద భావజాలం ఉన్నవారు కూడా ఉండటంతో భద్రతా సంస్థలు ఉలిక్కిపడుతున్నాయి.

స్థానిక సిరియన్ పౌరులు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నప్పటికీ, వారిని తనిఖీ చేసే వ్యవస్థ ప్రస్తుతం అక్కడ లేదు. విదేశీయులు, ఐసిస్ కటిన మద్దతుదారులు ఇప్పుడు అలెప్పో, ఇడ్లిబ్ వంటి అస్థిర ప్రాంతాలకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా తన వంతుగా త్వరితగతిన స్పందించి సుమారు 5,700 మంది అనుమానిత పురుష పోరాట యోధులను విమానాల ద్వారా ఇరాక్‌కు తరలించింది. జైళ్లు బద్ధలై వారు తప్పించుకోకుండా చూసేందుకు ఈ చర్య తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ భారాన్ని మోయడం బాగ్దాద్‌ ప్రభుత్వంపై పెద్ద సవాలుగా మారింది.

ఇదే సమయంలో రోజ్ క్యాంపులో ఉన్న మహిళలు, పిల్లల స్వదేశీ వాపసీ ప్రక్రియ కూడా గందరగోళంగా మారింది. ఫిబ్రవరి 2026లో 34 మంది ఆస్ట్రేలియన్లను తరలించే ప్రయత్నం సాంకేతిక కారణాలతో విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల వల్ల కొందరు ఐరోపా మహిళలు స్మగ్లర్ల సాయంతో టర్కీకి చేరుకుని, తమ దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. ఏది ఏమైనా, సిరియాలో చెల్లాచెదురైన ఈ వేలాది మంది ఉగ్రవాద సానుభూతిపరులు భవిష్యత్తులో ప్రపంచ శాంతికి మరో ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories