మానవాళి ఉసురు తీయడానికి పురుడు పోసుకున్న సరికొత్త వైరస్..

మానవాళి ఉసురు తీయడానికి పురుడు పోసుకున్న సరికొత్త వైరస్..
x
Highlights

రోజుకో కొత్త జబ్బు.. గంటకో రకం బాధలు.. ప్రపంచ సరికొత్త వ్యాధులకు నిలయంగా మారిపోతోంది. డెంగ్యూ, స్వైన్ఫ్లూ ఇలా ఎన్నో రకాల వ్యాధులు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చి జనాల్ని చుట్టుముట్టేశాయి. ఇప్పుడు మరో సరికొత్త వైరస్ పురుడు పోసుకుందట మానవుల ఉసురు తీయాడానికి.

రోజుకో కొత్త జబ్బు.. గంటకో రకం బాధలు.. ప్రపంచ సరికొత్త వ్యాధులకు నిలయంగా మారిపోతోంది. డెంగ్యూ, స్వైన్ఫ్లూ ఇలా ఎన్నో రకాల వ్యాధులు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చి జనాల్ని చుట్టుముట్టేశాయి. ఇప్పుడు మరో సరికొత్త వైరస్ పురుడు పోసుకుందట మానవుల ఉసురు తీయాడానికి. ఇది అలాంటి ఇలాంటి వైరస్ కాదట. ఇది యాక్టివ్ అయి పని మొదలు పెడితే.. 36 గంటల్లో 50 నుంచి 80 మిలియన్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయట. ఇది వాళ్ళూ వీళ్ళూ చెబుతున్న పోసుకోలు విషయం కాదు. స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతున్న సత్యం. 'ఎ వరల్డ్ ఎట్ రిస్క్' పేరుతొ అమెరికాలో ఇటీవల విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాన్ని వివరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

కొత్తగా పరిచయం అయిన ఈ వైరస్ వల్ల మిలియన్ల సంఖ్యలో జనం అతి తక్కువ సమయంలో ప్రాణాలు కోల్పోతారని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల సోకే శ్వాసకోశ వ్యాధి ప్రాణాంతకంగా మారి వేగంగా ప్రాణాలను కబలిస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్, నార్వే మాజీ ప్రధాని డాక్టర్ గొ అర్లం బ్రుమ్డట్లాండ్ నాయకత్వం లోని జేపేఎమ్బీ బృందం ఈ హెచ్చరికలు చేసింది.

గతంలో నిఫా, కలరా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వైరస్ లు ఏ ప్రాంతంలో ప్రబలడానికి అవకాశం ఉందో మ్యాప్ లో చూపించిన నివేదిక లానే ఈ నివేదికలోనూ ఈ ప్రమాదకర వైరస్ ఎక్కడ వ్యాపించే అవకాశం ఉంధో ఇప్పటికే ఆ బృందం గుర్తిన్చిందట. అయితే, ఇంకా దానిపైన విస్తృత పరిశోధనలు జరుగుతున్నందున వాటిని పూర్తీ చేసి అన్ని వివరాలనూ సవివరంగా వెల్లడిస్తామని నివేదికలో ఈ బృందం పేర్కొంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories