అమెరికా టార్గెట్‌గా ఇరాక్ దాడులు..

అమెరికా టార్గెట్‌గా ఇరాక్ దాడులు..
x
Highlights

ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌ యుద్ధ భూమిగా మారింది. అమెరికాపై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులకు దిగుతోంది....

ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌ యుద్ధ భూమిగా మారింది. అమెరికాపై ప్రతీకార దాడులు మొదలయ్యాయి. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులకు దిగుతోంది. అమెరికా బలగాలు మోహరించిన అల్‌ బలాద్‌ వైమానిక స్థావరంపై రెండు కత్యుషా శ్రేణి రాకెట్లు పడ్డాయి. బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఉన్న గ్రీన్‌ జోన్ ప్రాంతం వద్ద రెండు మోర్టార్లు పడ్డాయి. వీటివల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయా అన్నది తెలియరాలేదు. అయితే ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు కత్తులు దూసుకుంటుండడంతో పశ్చిమాసియాలో భయాందోళనలు నెలకొన్నాయి.

బాగ్దాద్‌లో అమెరికా ఆస్తులపై జరిగిన దాడిని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. మరోసారి దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌లోని మెయిన్‌ సెంటర్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నామని ట్రంప్‌ వెల్లడించారు. బెదిరింపులను అమెరికా ఏమాత్రం కోరుకోవడం లేదన్నారు. బాగ్దాద్‌ను అమెరికా సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. బాగ్దాద్‌ నుంచి ఇరాక్‌ సైన్యాన్ని తప్పించింది అగ్రరాజ్యం.10 వేల మంది సైన్యాన్ని అమెరికా ఇరాక్‌కు పంపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories