కరోనా ఎఫెక్ట్.. 54 వేలమంది ఖైదీల విడుదల!

Iran coronavirus
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో ఇరాన్ లో 54 వేలమంది ఖైదీలను తాత్కాలికంగా రిలీజ్ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.. వందల...

కరోనా వైరస్ ప్రభావంతో ఇరాన్ లో 54 వేలమంది ఖైదీలను తాత్కాలికంగా రిలీజ్ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.. వందల వేల మంది ఆరోగ్య కార్యకర్తలను అందుబాటులో ఉంచింది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో భాగంగానే ఖైదీలను తాత్కాలికంగా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఖైదీల విడుదలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని ఇరాన్ న్యాయవ్యవస్థ ప్రతినిధి ఘోలామ్‌హోస్సేన్ ఎస్మాయిలీ చెప్పారు.

ఈ మేరకు ఇరాన్ లో అధికారిక వార్తా సంస్థ ఇస్నా నివేదించింది. అయితే వారిని ఎక్కడ ఉంచాలో లేదా అధికారులు వారిని ఎలా ట్రాక్ చేస్తారో మాత్రం ఆయన వివరించలేదు, "భద్రతా ఖైదీలు లేదా సాధారణ ఖైదీలుగా ఉన్న వారితో సంబంధం లేకుండా ఖైదీల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం" అని మాత్రమే ఎస్మాయిలీ చెప్పారు. గూడచర్యం ఆరోపణలపై ఇరాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రిటిష్-ఇరానియన్ నజానిన్ జాఘారి-రాట్‌క్లిఫ్ విడుదల చేసిన వారిలో ఉన్నారో లేదో అనేది కూడా అస్పష్టంగా ఉంది.

మరోవైపు మరణాల సంఖ్య మరియు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున వైరస్ నివారణ చర్యలు తీసుకోవాలని ఇరాన్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ లో ఇప్పటివరకు 92 మంది మరణించారు, తాజాగా 586 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, దీంతో మొత్తం 2,922 వరకు నమోదైందని ఆ దేశ మీడియా తెలిపింది. కరొనను ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్‌ఓ దుబాయ్ నుంచి యుఎఇ సైనిక విమానం ద్వారా ఎనిమిది టన్నుల మందులు మరియు టెస్ట్ కిట్‌లను సరఫరా చేసిందని, అలాగే ఆరు బృందాలు ఎపిడెమియాలజిస్టులు, వైద్యులు మరియు ప్రయోగశాల పరీక్షల నిపుణులను సరఫరా చేసిందని ఇరాన్ తెలిపింది.

ఇదిలావుంటే ఇరాన్ లో ప్రసిద్ధ నగరమైన కోమ్‌ లో అనేక పవిత్ర ప్రదేశాలు ఉండటంతో.. క్రమం తప్పకుండా పెద్ద సంఖ్యలో ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , బహ్రెయిన్‌తో సహా మిడిల్ ఈస్ట్ దేశాల పర్యాటకులు సందర్శిస్తారు. అయితే ఇక్కడ కరోనా వైరస్ కేసులు నమోదనట్టు నివేదికలు వెలువడటంతో సందర్శకులు ఈ నగరణాన్ని సందర్శించేందుకు భయపడుతున్నారు. దీంతో ఆ దేశంలో పర్యాటక రంగంపై ప్రభావం పడినట్లయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories