ప్రపంచవ్యాప్తంగా మెల్లగా విస్తరిస్తోన్న కోవిడ్‌ మహమ్మారి.. ఇరాన్‌లో 66 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా మెల్లగా విస్తరిస్తోన్న కోవిడ్‌ మహమ్మారి.. ఇరాన్‌లో 66 మంది మృతి
x
Corona Virus File Photo
Highlights

కోవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మెల్లగా విస్తరిస్తోంది. ప్రభుత్వాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు 70 దేశాల్లోని 88వేల మందికి ఈ వ్యాధి పాకింది....

కోవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మెల్లగా విస్తరిస్తోంది. ప్రభుత్వాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు 70 దేశాల్లోని 88వేల మందికి ఈ వ్యాధి పాకింది. చైనాలో ఈ వైరస్‌తో 2,900 మంది మృత్యువాతపడగా అన్ని దేశాల్లో కలిపి 3 వేల మంది వరకు చనిపోయారు. చైనా వెలుపల అత్యధికంగా ఇరాన్‌లో 66 మంది కోవిడ్‌తో మృతి చెందడం, మరో 1,500 మందికి వ్యాధి నిర్ధారణయినట్లు ఆ దేశం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.

చైనా తర్వాత అత్యధికంగా ఇరాన్‌లో మరణాలు నమోదయ్యాయి. 'ప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు మిర్‌మొహమ్మదీ సహా 66 మంది ఈ వ్యాధితో చనిపోయారు. మరో 1,501 మందిలో వైరస్‌ లక్షణాలను గుర్తించామని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories