Atefah Sahaaleh: 2004లో 16ఏళ్ల అతేఫాను నడిరోడ్డుపై ఉరితీసిన ఇరాన్ కోర్టు..ఇరాన్‌లో తాజా పరిస్థితులకు ఆమె మరణమే కారణమా?

Atefah Sahaaleh:  2004లో 16ఏళ్ల అతేఫాను నడిరోడ్డుపై ఉరితీసిన ఇరాన్ కోర్టు..ఇరాన్‌లో తాజా పరిస్థితులకు ఆమె మరణమే కారణమా?
x
Highlights

Atefah Sahaaleh: అది ఆగష్టు 15, 2004 ఉదయం, ఇరాన్‌లోని నేకా నగరం భయంతో వణికిపోయింది. ఆ దేశానికి చెందిన 16ఏళ్ల అతేఫా సహలేహ్ అనే ఒక బాలికను అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఉరితీశారు.

Atefah Sahaaleh: గతకొన్నాళ్లులా ఇజ్రాయిల్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్‌లో వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందలాది మంది గాయాలుపాలవుతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. దీనికంతటికీ కారణం ఏంటి? అంటే ఇప్పుడు, 2004లో జరిగిన ఒక ఘోరమైన సంఘటన వైరల్ అవుతుంది.

అది ఆగష్టు 15, 2004 ఉదయం, ఇరాన్‌లోని నేకా నగరం భయంతో వణికిపోయింది. ఆ దేశానికి చెందిన 16ఏళ్ల అతేఫా సహలేహ్ అనే ఒక బాలికను అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఉరితీశారు. ఈ ఘోరం అక్కడ జరగడానికి కారణం.. ఆ దేశ సుప్రీంకోర్టు విధించిన శిక్ష. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. ఇది చాలా దారుణమని నినదించాయి. కానీ ఏం లాభం, ఒక బాలికి తన నిండు ప్రాణాలను పోగొట్టుకుంది. ఇప్పుడు ఈ బాలిక విషాధ గాధ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇస్లామిక్ పాలనను ఆమె శపించిందని ఆమెకు జరిగిన అన్యాయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నారు. అవును ఇది నిజమే.. ఆమెకు జరిగిన అన్యాయం కారణంగానే ఇరాన్‌ ఇప్పుడు భారీ సంక్షోభంలో కూరికిపోయిందని, ఆమెను నడిరోడ్డుపై ఉరితీసిన తర్వాత నుంచి దేశంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆమెను ఆ దేశ కోర్టు ఎందుకు మరణ శిక్షను విధించింది అంటే... పవిత్రతకు వ్యతిరేకంగా నేరాలు చేసిందట. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆమె వ్యభిచారానికి పాల్బడిందని, అందుకే ఆమెను ఉరితీయాలని కోర్టు నిర్ణయించింది. అయితే కోర్టు చెప్పిన దాని ప్రకారం అతేఫా వయసు 22 ఏళ్లు. కానీ తన కుటుంబీకులు చెప్పిన దాని ప్రకారం ఆమె వయసు 16. ఇరాన్ చట్టాల ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లని ఉరితీయకూడదు. అందుకే ఆమె వయసు ఎక్కువగా వేసి మరీ ఆమెను నడిరోడ్డుపై ఉరితీసారనే వాదనలు కూడా ఉన్నాయి.

అదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. అతేఫా కథను వివరిస్తూ.. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడి చట్టం..? ముస్లిం దేశాలలో మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది, కానీ చాలావరకు బయటకు రావడం లేదు. కేవలం ఆడవాళ్లకు మాత్రమే కొన్ని చట్టాలు వర్తిస్తాయి. ఇదేం న్యాయమంటూ ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కి వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. అతేఫాను సపోర్ట్ చేస్తూ ఎంతోమంది కామెంట్లు చేశారు. ఇక ఇరాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి కూడా ఇరాన్ దేశానికి ఆమె ఇచ్చిన శాపమేనని కొంతమంది వాదన. ఇరాన్‌లో మహిళలకు పురుషులకంటే తక్కువ చట్టాలున్నాయి. ఎక్కువ శిక్షలు ఉన్నాయి. వీటనన్నింటినీ మారిస్తేనే కానీ.. ఆ దేశంలో యుద్ధ సెగ ఆగదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories