Coronavirus: ఆ దేశంలో కరోనావైరస్ తొందరగా మాయం అయింది అందుకే..

Coronavirus: ఆ దేశంలో కరోనావైరస్ తొందరగా మాయం అయింది అందుకే..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో , వియత్నాం దేశంలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి.. వైరస్ ను అంతమొందించడంలో ఆ దేశ...

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో , వియత్నాం దేశంలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి.. వైరస్ ను అంతమొందించడంలో ఆ దేశ వైద్యులు స్పందించిన తీరు వేగంగా ఉందని.. అందుకే వ్యాప్తి ఎక్కువగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

వియాత్నంలో మొత్తం 16 మంది సోకిన రోగులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది, అలాగే ప్రాణాంతక వ్యాధి నుండి రోగులకు విముక్తి లభించిందని వైద్యులు ప్రకటించారు. గత 15 రోజులుగా, శుక్రవారం సహా, కొత్త అంటువ్యాధుల కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని ప్రభుత్వం తెలిపింది. చివరి కేసు ఫిబ్రవరి 13 న నివేదించారు, కరోనా వైరస్ కారణంగా హనోయికి ఉత్తరాన ఉన్న ఒక గ్రామం 20 రోజులు లాక్డౌన్లో ఉంది. ప్రస్తుతం అక్కడ కూడా సాధారణ పరిస్థితులు ఉన్నాయని ఆ దేశం తెలిపింది.

వైరస్ బారిన పడిన 16వ మరియు చివరి రోగిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్‌వివి అనే 50 ఏళ్ల వ్యక్తికి తన 23 ఏళ్ల కుమార్తె నుండి వైరస్ ఇన్‌ఫెక్షన్‌ సోకింది..ఆమె జపనీస్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది కార్మికులలో ఒకరు, ఆమె కరోనా వైరస్ కు కేంద్రంగా ఉన్న చైనాలోని వుహాన్ నుండి తన బృందం తోపాటూ జనవరి 17న తిరిగి వియత్నాం వచ్చారు. ఈ బృందంలో ఆరుగురు వ్యక్తులు పాజిటివ్ పరీక్షలు నమోదయ్యాయి. వారి కారణంగా బంధువులు, స్నేహితులు కొందరు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. వారిలో మూడు నెలల శిశువు కూడా ఉన్నారు.

వైరస్ పై వియత్నాం ఆరోగ్య శాఖా మంత్రి మాట్లాడుతూ.. 'COVID-19 తో పోరాటం ఒక యుద్ధమైతే, మేము మొదటి రౌండ్లో గెలిచాము కాని మొత్తం యుద్ధంలో విజయం సాధించలేదు' అని వు డక్ డ్యామ్ను చెప్పారు. మంగళవారం నగర మరియు ప్రాంతీయ అధికారులతో ఆన్‌లైన్ లో ఆయన సమావేశం నిర్వచించారు. అప్పటినుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 మందిని కరోనా వైరస్ బలితీసుకుంది. అలాగే శనివారం నాటికి 83,000 మందికి పైగా వైరస్ సోకింది. అయితే ఇది వేరే కథ, వియత్నాంలో, వైరస్ ప్రారంభ దశలో దీన్ని నివారించడంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై ప్రభుత్వం వేగంగా స్పందించడం చాలా కీలకమని.. అందువల్లే అక్కడ వైరస్ కంట్రోల్ లో ఉందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories