Indonesia New Law: పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుంటే జైలుకే! కొత్త చట్టం తెచ్చిన ప్రభుత్వం.. పర్యాటకులకు కూడా షాక్!

Indonesia New Law: పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుంటే జైలుకే! కొత్త చట్టం తెచ్చిన ప్రభుత్వం.. పర్యాటకులకు కూడా షాక్!
x
Highlights

ఇండోనేషియాలో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుంటే ఏడాది జైలు శిక్ష పడుతుంది. ఈ నిబంధనలు పర్యాటకులకు కూడా వర్తిస్తాయి.

సాధారణంగా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఒక దేశం మాత్రం విభిన్నమైన చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై అక్కడ పెళ్లికి ముందు శారీరకంగా కలిసినా లేదా సహజీవనం (Live-in Relationship) చేసినా నేరంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఇండోనేషియాలో కొత్త శిక్షాస్మృతి

పర్యాటక స్వర్గధామంగా పేరొందిన ఇండోనేషియా తన దేశ చట్టాల్లో భారీ మార్పులు చేసింది. దశాబ్దాల కాలం నాటి పాత డచ్ చట్టాల స్థానంలో కొత్త స్వదేశీ శిక్షాస్మృతిని (Criminal Code) అధికారికంగా అమలులోకి తెచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పెళ్లికి ముందు శారీరక సంబంధం కలిగి ఉండటం చట్టవిరుద్ధం.

శిక్షలు ఎలా ఉంటాయి?

  • ప్రీ-మ్యారిటల్ సెక్స్: వివాహం చేసుకోకుండా శారీరకంగా కలిస్తే గరిష్ఠంగా ఏడాది జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు.
  • సహజీవనం: పెళ్లి కాకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఫిర్యాదు ఎవరు చేయాలి?

ఈ చట్టంలో ఒక కీలక మినహాయింపు ఉంది. ఎవరూ పడితే వారు ఫిర్యాదు చేయడానికి వీలులేదు. కేవలం నిందితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడో వ్యక్తులు లేదా పొరుగువారు చేసే ఫిర్యాదులను అధికారులు స్వీకరించరు.

పర్యాటకుల పరిస్థితి ఏంటి?

ఈ చట్టం కేవలం ఇండోనేషియా పౌరులకే కాదు, అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా బాలి వంటి ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల్లో ఇది ఆందోళన కలిగిస్తోంది. హోటల్ యాజమాన్యాలు కూడా ఈ నిర్ణయం వల్ల పర్యాటక రంగం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇతర కఠిన నిబంధనలు:

శారీరక సంబంధంపైనే కాకుండా, మరికొన్ని నిబంధనలను కూడా కొత్త చట్టంలో చేర్చారు:

  • దేశాధ్యక్షుడిని విమర్శించడం నేరం.
  • ప్రభుత్వ సంస్థలను అవమానిస్తే శిక్ష తప్పదు.
  • జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా చట్టవిరుద్ధం.

మానవ హక్కుల సంఘాలు ఈ చట్టాన్ని పౌర స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం తన నిర్ణయానికే మొగ్గు చూపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories