ఇండోనేషియా విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ లభ్యం

ఇండోనేషియా విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ లభ్యం
x


representational image


Highlights

ఇండోనేషియాలో ప్రయాణికుల విమానం గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే

ఇండోనేషియాలో ప్రయాణికుల విమానం గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. జకార్తా నుంచి పోంటియానక్‌కు 62 మందితో బయల్దేరిన ఎయిర్ బోయింగ్ 737-500 శ్రీ విజయ విమానం ఆచూకీ గల్లంతైంది. దానికిలో ప్రయాణించిన వారంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ విమానం బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. గాలింపు చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది బ్లాక్ బాక్స్ ను గుర్తించారు. అయితే కొందరి మృతదేహాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.

ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే రాడార్‌కు చిక్కకుండా అదృశ్యమైంది. చివరగా 2 గంటల 40 నిమిషాలకు విమానం నుంచి సిగ్నల్స్ అందినట్లు చెబుతున్నారు అధికారులు. ఆ సమయంలో జావా సముద్రం ప్రాంతంలో పదివేల అడుగుల ఎత్తులో విమానం ఉందని తెలిపారు. అయితే విమానం సముద్రంలో కుప్పకూలి పోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్లాక్ బాక్స్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లలో నిక్షిప్తమైన డేటాను పరిశీలిస్తే విమానం ఎందుకు కూలిపోయింది? సాంకేతిక వైఫల్యంతో కుప్పకూలిందా? చివరి క్షణాల్లో కాక్ పిట్ లో ఉన్న పైలెట్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? అనే అంశాలు వెల్లడికానున్నాయి.

మరోవైపు థౌజండ్ ద్వీపాల్లో విమాన శకలాలను స్థానిక జాలర్లు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విమానం అదృశ్యంపై సంబంధిత విమానయాన సంస్థ కూడా స్పందిచింది. జకార్తా నుంచి పోంటియానక్ వెళ్లేందుకు 90నిమిషాల సమయం పడుతుందని పేర్కొంది. ఈ విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో మొత్తం 62 మంది ఉన్నట్టు స్పష్టం చేసింది. అయితే ఇండోనేషియాలోని పశ్చిమ కలిమంటన్ ప్రావిన్స్‌లోని పోంటియానక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 737-500 విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories