Indian Army: ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు.. పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు

Indian Army: ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు.. పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు
x
Highlights

Indian Army: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది....

Indian Army: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రస్ధావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని చేపట్టాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడింది భారత సైన్యం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు పాకిస్తాన్ లోని ఉగ్రమౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు భారత్ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా..పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది.

దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకీ జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా పోలీసులు చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories