తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష!

తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష!
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్‌ ఆకుతోట(27) కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్నట్టు అమెరికా అధికారులు వెల్లడిస్తున్నారు....

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్‌ ఆకుతోట(27) కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్నట్టు అమెరికా అధికారులు వెల్లడిస్తున్నారు. అమెరికాలో తాను పనిచేస్తున్న కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు గాను అతనికి ఈ శిక్ష పడనున్నట్టు తెలుస్తోంది. కాగా విశ్వనాథ్‌ ఆకుతోట స్టూడెంట్‌ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్‌ రోజ్‌ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు.

అయితే ఫిబ్రవరిలో 2019 లో 'యూఎస్‌బీ కిల్లర్‌' అనే పెన్‌డ్రైవ్‌ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. పైగా ఈ పనిని మొబైల్‌లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్‌ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. దీంతో అతనికి పదేళ్ల జైలు శిక్ష పడనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories