యూఎస్ హెల్త్ ఏజెన్సీ డైరెక్టర్‌ పదవికి జయ్: ఎవరీ భట్టాచార్య?

యూఎస్ హెల్త్ ఏజెన్సీ డైరెక్టర్‌ పదవికి జయ్: ఎవరీ భట్టాచార్య?
x
Highlights

జయ్ భట్టాచార్యను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారని అమెరికా సెనెట్ ధ్రువీకరించింది.

జయ్ భట్టాచార్యను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎన్ఐహెచ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారని అమెరికా సెనెట్ ధ్రువీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత 2024 నవంబర్ లో జయ్ భట్టాచార్యను నియమిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. జయ్ భట్టాచార్య నియామకాన్ని యూఎస్ సెనెట్ మోదం తెలిపింది.

ఎవరీ జయ్ భట్టాచార్య?

ఇండియాలోని కోల్‌కత్తాలో జయ్ భట్టచార్య 1968లో జన్మించారు. తన తల్లి ఓ మురికివాడ నుంచి వచ్చారని, తన తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని జయ్ భట్టాచార్య ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినట్టు ఆయన వివరించారు. 1970లో జయ్ భట్టాచార్య కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. తొలుత మసాచుసెట్స్‌, ఆ తర్వాత లాస్ ఏంజిల్స్, కాలిఫొర్నియాలో స్థిరపడ్డారు. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీ నుంచి జయ్ భట్టాచార్య నాలుగు డిగ్రీలు పొందారు. 1990లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. 1997లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండీ పట్టా పొందారు. 2000లో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. కరోనా సమయంలో అప్పటి అమెరికా ప్రభుత్వం వ్యవహరించిన తీరును మరో ఇద్దరు డాక్టర్లతో కలిసి గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ పేరుతో ఆయన చేసిన ప్రచురణలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories