టెక్‌ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..!

టెక్‌ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..!
x
Highlights

భారత సంతతికి చెందిన అరవింద్‌ కృష్ణ.. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా ఎన్నికయ్యారు. ఐబీఎం సీనియర్‌ వైఎస్‌...

భారత సంతతికి చెందిన అరవింద్‌ కృష్ణ.. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా ఎన్నికయ్యారు. ఐబీఎం సీనియర్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కొనసాగుతున్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓ గా ఎన్నుకున్నట్టు ప్రకటించింది. ఆ ఏప్రిల్ 6 నుంచి కృష్ణ ఐబీఎం సీఈఓ తో పాటు డైరెక్టర్ బాధ్యతల్లో కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. అలాగే ఐబీఎంలో సీనియర్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌, రెడ్‌ హ్యాట్‌ సీఈఓ అయిన జేమ్స్‌ వైట్‌ హర్ట్స్‌ ఐబీఎం ప్రెసిడెంట్‌గా కంపెనీ డైరెక్టర్లు ఎన్నుకున్నట్టు చెప్పింది.

ఆమె ఈ ఏడాది న ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా కృష్ణ (57), 1990 లో ఐబిఎమ్‌లో చేరారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు ఉర్బానా-ఛాంపెయిన్ వద్ద ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డి చేశారు. 'ఐబిఎం తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎన్నుకోబడటం నాకు చాలా ఆనందంగా ఉంది, గిన్ని మరియు బోర్డు నాలో ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను.. అని కృష్ణ ఐబిఎం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐబీఎం నవ శకానికి అరవింద్‌ సరైన నాయకుడని ఐబీఎం ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ అభిప్రాయపడ్డారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్లౌడ్‌, క్వాంటం కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ తయారీలో అరవింద్‌ బాగా కృషి చేశారని కొనియాడారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిఙ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. కాగా గిన్నీ రోమెట్టీ 40 ఏళ్ల పాటు ఐబీఎంలో పనిచేశారు. ఇదిలావుంటే భారత సంతతికి చెందిన ప్రముఖులు గొప్ప గొప్ప సంస్థలలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ఉండగా గూగుల్ సీఈఓ గా సుందర్ పిచాయ్ ఉన్నారు. తాజాగా భారత సంతతికి చెందిన అరవింద్‌ కృష్ణ ను ఐబీఎం కు సీఈఓ గా ఎంపిక చేయడం తో భారతీయుల్లో ఆనందం నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories