దుబాయ్ లో కుమార్తెను చూడటానికి వెళ్ళీ అక్కడే కన్నుమూసిన తండ్రి

దుబాయ్ లో కుమార్తెను చూడటానికి వెళ్ళీ అక్కడే కన్నుమూసిన తండ్రి
x
Highlights

భారతదేశానికి చెందిన కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్, దుబాయ్ లో తన కుమార్తెను చూడటానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విమాన సర్వీసుల నిలిపివేశారు.

భారతదేశానికి చెందిన కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్, దుబాయ్ లో తన కుమార్తెను చూడటానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విమాన సర్వీసుల నిలిపివేశారు.. తిరిగి రాలేకపోయారు, ఈ క్రమంలో గుండెపోటుతో మరణించినట్లు అతని కుటుంబం శనివారం తెలిపింది. కేరళకు చెందిన ఎం. శ్రీకుమార్ (70) , ఆయన సతీమణి శ్రీకుమారి , షార్జాలో టీచర్ గా పనిచేస్తున్న తమ కుమార్తె శ్రీజను చూడటానికని గత నెల వెళ్లారు.

వారు శనివారం కేరళకు తిరిగి రావలసి ఉంది, అయితే విమానాలు నిలిపివేయబడినందున విమానాల రాకపోకలు ఆగిపోయాయని గల్ఫ్ న్యూస్ నివేదించింది. దాంతో వారు ఇండియాకు రాలేకపోయారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన గురువారం ఛాతీ నొప్పితో బాధపడ్డారు.. దాంతో షార్జాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో తీవ్రమైన గుండెపోటుతో ఆయన ఈ ఉదయం కన్నుమూశారు అని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా శ్రీకుమార్ కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని మహారాజాస్ కళాశాలలో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యారు. ఇదిలావుంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీకుమార్ మృతదేహాన్ని భారత్ కు తరలిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories