ఇరాన్ నుండి భారతీయుల్ని తరలించడానికి ప్రయత్నాలు

ఇరాన్ నుండి భారతీయుల్ని తరలించడానికి ప్రయత్నాలు
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకునే భారతీయుల కోసం అధికారులు కృషి చేస్తున్నారని ఇరాన్ లో భారత ప్రతినిధి గడ్డం...

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకునే భారతీయుల కోసం అధికారులు కృషి చేస్తున్నారని ఇరాన్ లో భారత ప్రతినిధి గడ్డం ధర్మేంద్ర శనివారం తెలిపారు. చైనాలో ఏర్పాట్లు చేసిన విధంగానే ఇరాన్ కు కూడా విమానాలను పంపించి భారతీయుల్ని తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ లో ఎక్కువగా గుజరాతీయులు, కాశ్మీరీయులు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 340 మంది మత్స్యకారులు ఇరాన్ దేశంలోని బందర్ ఏ చిరు, చిరుయేహ్, హార్మోజగన్ ప్రావిన్సుల్లో పనిచేస్తున్నారు. అయితే కరోనా వైరస్‌గా కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వారంతా ఇరాన్ దేశంలోనే చిక్కుకుపోయారు. తమని ఇండియాకు తరలించాలని వారు వేడుకుంటున్నారు. మరోవైపు భారతీయుల తరలింపునకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి ఇరాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని గడ్డం ధర్మేంద్ర చెప్పారు. ఇక్కడ కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో 43 మంది మరణించారు. వాస్తవానికి ఇరాన్‌లో కొద్ది రోజుల వ్యవధిలోనే ఊహించని రీతిలో భారీగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానౌష్ జహన్‌పూర్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో కొత్తగా 100 కు పైగా కేసులు నమోదయ్యాయని.. దాంతో మొత్తం కేసుల సంఖ్య 300 కు పెరిగిందని తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి 130 మందికి పైగా ప్రయాణికులతో టర్కీలోని ఇస్తాంబుల్‌కు వస్తున్న ఓ విమానాన్ని రెండు రోజుల కిందట రాజధాని అంకారాకు మళ్లించారు. వారందరినీ 14 రోజులపాటు నిర్బంధ పర్యవేక్షణలో ఉంచినట్టు టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

కరోనావైరస్ బాధితులలో ఇరాన్ ఉపాధ్యక్షురాలు కూడా చేరిపోయారు. ఇరాన్ ఏడుగురు ఉపాధ్యక్షులలో మహిళల వ్యవహారాలను పర్యవేక్షించే మసౌమెహ్ ఎబ్టెకర్ ఇందులో ఉన్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాల్లో 80,000 మందికి పైగా జనం కరోనావైరస్ బారిన పడ్డారు. డిసెంబర్‌లో మొదలైన ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో అత్యధికులు చైనాలోనే ఉన్నారు. ఈ వైరస్ వల్ల వచ్చే 'కోవిడ్-19' అనే శ్వాసకోశ వ్యాధివల్ల ఇప్పటివరకూ 3000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories